ఈ మధ్యకాలంలో ఫేమ్ వచ్చిన సెలబ్రిటీలను యూట్యూబర్స్ ను లేకపోతే స్టార్ హీరోలను హీరోయిన్స్ వంటి వారిని బెదిరించడం చాలా ఈజీగా మారిపోతున్నదట.. ముఖ్యంగా వీళ్ళ పైన రాళ్లు విసిరితే తమకు డబ్బులు వర్షం కురుస్తుందని చాలామంది రాజకీయ నేతలను మించిపోయి మరి సామాన్యులు కూడా బ్లాక్ మెయిల్ చేయడం జరుగుతున్నట్టు కనిపిస్తోందట. ఇటీవలే తెలుగు సినీ ఇండస్ట్రీలో జరిగిన కొన్ని సంఘటనలను చూస్తే అలాగే కనిపిస్తోంది. ముఖ్యంగా మీడియా రాజకీయ నాయకులు చివరికి అభిమానులు కూడా కొంతమంది హీరోలను బ్లాక్ మెయిల్ చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళు ఇంత లోకువవ్వడానికి కారణం ఏంటా అని కొంతమంది ఆరతియ్యగా ఒక న్యూస్ వైరల్ గా మారుతున్నదట.



ఇటీవలే మోహన్ బాబు ఇంట్లో గొడవలు జరుగుతున్న సమయంలో మీడియా ప్రతినిధులు మోహన్ బాబు ఇంటి లోపలికి వెళ్లి అతని ముందు మైకు పెట్టి రచ్చ చేయడంతో ఒక జర్నలిస్టు పైన చెయ్యి చేసుకున్నారు. తన కుటుంబ పరువుపోయిన.. చివరికి ఆ జర్నలిస్టుకి దెబ్బలు కూడా తగిలాయి.. కానీ చివరికి మోహన్ బాబు కుటుంబ సభ్యులు ఆ జర్నలిస్టు వద్దకు వెళ్లి క్షమాపణలు కూడా చెప్పారు..అయితే అప్పటికే ఆ జర్నలిస్ట్ అటెంప్ట్ మర్డర్ కేసు కూడా మోహన్ బాబు మీద పెట్టడం జరిగింది.


ఇక మరొక హీరో విషయానికి వస్తే అల్లు అర్జున్.. ఇటీవల విడుదలైన పుష్ప 2 సినిమా గురించి ఎవరు మాట్లాడుకోవడం లేదు. కేవలం ఆయన పైన పోలీసుల తీరు పోలీసులపైన అల్లు అర్జున్ తీరు గురించే ఎక్కువగా చర్చించుకుంటున్నారు. అల్లు అర్జున్ సహాయం చేయలేదనేది ఇప్పుడు అంత చర్చగా జరుగుతోంది.అలాగే ఆ బాధ్యత కుటుంబాన్ని కూడా పరామర్శించలేదని అల్లు అర్జున్ ఇమేజ్ ని దెబ్బతీశారంటూ ఇటీవల అల్లు అర్జున్ కూడా ఈ విషయం పైన మాట్లాడారు. కానీ తమని బాధిత కుటుంబ దగ్గరికి వెళ్లడానికి రూల్స్ చెబుతున్నారంటూ అల్లు అర్జున్ తెలిపారు.



మరొక నటుడు జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా రిలీజ్ సమయంలో ఒక అభిమాని దేవర సినిమా చూసి మరణిస్తానంటూ ఎమోషనల్ గా వీడియోని వైరల్ గా చేయడంతో చివరికి ఎన్టీఆర్ కూడా వీడియో కాల్ ద్వారా ఆ అభిమానికి ధైర్యం చెప్పి అభిమానుల ద్వారా 5 లక్షల రూపాయలు సహాయం కూడా అందించారట. కానీ ఇటీవలే ఎన్టీఆర్ అభిమాని తల్లి తమ బిడ్డ బాధ్యత ఎన్టీఆర్ చూసుకుంటానని చెప్పారని ఇంకా డబ్బులు ఇవ్వాలి అంటూ ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది.


ఇలా వీరే కాకుండా చాలామంది సెలబ్రిటీలు అలుసవ్వడానికి ముఖ్యమైన కారణం పొలిటికల్ పరంగా కొంతమంది నేతలకు సపోర్ట్ చేయడం వల్ల చాలామంది కావాలనే ఉద్దేశంతోనే కొంతమంది ఏదో ఒక రూపంలో వీరిని ట్రోల్ చేసేలా, లేకపోతే ఇబ్బందులకు గురి చేసేలా చేస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కొంతమంది ఒకే కుటుంబంలో ఉన్న వేరువేరు పార్టీలకు సపోర్టు చేయడం వల్ల ఇవి మరింత ముదురుతున్నాయట. సినీ సెలబ్రిటీలు రాజకీయ రంగంలోకి రావడమే తప్పుగా మారిపోతోందట.

మరింత సమాచారం తెలుసుకోండి: