అల్లు బాబు అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం "పుష్ప-2" సినిమా గురించి జనాలకు చెప్పాల్సిన పనిలేదు. సినిమా ఓ వైపు కలెక్షన్ల విషయంలో రికార్డ్స్ సృష్టిస్తుంటే, మరోవైపు సంధ్య థియేటర్ దగ్గర జరిగిన వివాదం రోజురోజుకు ఐకాన్ బాబు మెడకు ఉచ్చు బిగిసుకున్నట్టు బిగుసుకోవడం గమనార్హం. ఈ నెల 5వ తేదీన విడుదలైన పుష్ప సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజై విజయ దుందుభి మోగించింది. అయితే, ఈ సినిమాకి సామాన్య జనాలనుండి మంచి స్పందన వచ్చినప్పటికీ, క్రిటిక్స్ నుండి మాత్రం అనేక విమర్శలను ఎంతకట్టుకుంటోంది. సినిమాని చూసిన కొంతమంది విశ్లేషకులు, నాయకులు అసలు ఈ సినిమా ద్వారా సమాజానికి ఎటువంటి సందేశం ఇవ్వదలుచుకున్నారు? అంటూ కామెంట్స్ చేయడం అందరికీ తెలిసినదే.

అవును, ఓ ఎర్ర చందనం స్మగ్లర్ ని హీరోగా చూపిస్తుండడం పట్ల కొందరు విమర్శిస్తున్నారు. దొంగతనం ఎలా చేయాలో ఈ సినిమా ద్వారా హీరో, దర్శక నిర్మాతలు జనాలకు నేర్పుతున్నారు అంటూ మండిపడుతున్నారు. ఈ సినిమా విడుదలైన తరువాత ఈ తరహా దొంగతనాలు ఎక్కువైనాయి అనేవారు కూడా లేకపోలేదు. ఈ క్రమంలోనే పుష్ప స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్ర కథను స్ఫూర్తిగా తీసుకున్న ఓ దొంగ ఏకంగా ఆర్టీసీ బస్సును హైజాక్ చేయడం పెను సంచలనం సృష్టిస్తోంది.

వివరాల్లోకి వెళితే, తమిళనాడు రాష్ట్రానికి చెందిన సాధిక్ అనే వ్యక్తి ఆదివారం కాకినాడ జిల్లా నర్సీపట్నంకు వచ్చి 'పుష్ప-2' చూసి బస్టాండులోని బస్సులోనే నిద్రపోయాడు. నిద్ర లేచిన తరువాత బస్సుకు తాళం ఉండటాన్ని చూసి స్టార్ట్ చేసి సీతారామరాజు జిల్లా చింతలూరుకు వరకు నడుపుకుంటూ పోయాడు. ఆ తరువాత నిద్ర మరలా ముంచుకు రావడంతో రోడ్డు పక్కన బస్సు ఆపి మళ్లీ నిద్రపోయాడు. ఇక బస్సు కనిపించకపోవడాన్ని గమనించిన బస్సు సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వగా రంగంలోకి దిగిన పోలీసులు.. హైజాక్ చేసిన బస్సు చింతలూరు వద్ద ఉన్నట్లు సమాచారం అందుకుని, అక్కడకు చేరుకుని బస్సును స్వాధీనపరుచుకున్నారు. అదేవిధంగా బస్సులో గుర్రుపెట్టి నిద్రపోతున్న దొంగను కూడా అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: