చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్లకు డిమాండ్ ఎంతో గట్టిగా ఉంటుంది.. వారు సినిమాలో నటించాలంటే వారి కోరికలు కూడా ఓ రేంజ్ లో ఉంటాయి .. అలాగే వారికి సినిమాల్లో నటించేందుకు ఇచ్చే రెమ్యూనరేషన్ కంటే వారికి కావాల్సినట్లు అన్నీ సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి నిర్మాతలకు చుక్కలు కనిపిస్తున్నాయి అంటూ ఎప్పుడూ సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది.. హీరోయిన్ల డిమాండ్లతో నిర్మాతలు కొందరు సినిమాలు తీసే ఆలోచనను మానేస్తున్నారు  అంటూ చిత్ర పరిశ్రమంలో టాక్.. అయితే హీరోయిన్ల చేసే డిమాండ్ ఏంటో ఒకసారి ఇక్కడ చూద్దాం. సినిమాలో ఒక్క హీరోయిన్ నటిస్తుంది అంటే ఆ నిర్మాత జేబులకు చిల్లు పడుతుంది .. సినిమాలో నటించేందుకు రెమ్యూనరేషన్ మొత్తం ముందుగానే తీసేసుకుంటారు .. ఆ చెక్కు చేతులో పడితేనే సినిమా గురించి ఆలోచిస్తామంటారు లేకుంటే మాత్రం చాలా సినిమాలు ఉన్నాయి లేదో మాకు స్టోరీ నచ్చలేదంటూ రిజెక్ట్ చేస్తారు. వాటికన్నా పెద్ద కోరికలు రిచ్ ఏరియాలో లగ్జరీ ఫ్లాట్స్ లేదా ఈ  ఈఏంఐ లను కట్టమని డిమాండ్ చేస్తున్నారని కొందరు నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే వారికి మేకప్ వేయడానికి తెలుగు రాష్ట్రాల్లోని మేకప్ ఆర్టిస్టులు చాలటం లేదు .. ముంబై నుంచి స్పెషల్ మేకప్ లు , హెయిర్ స్టైల్స్ కోసం కావాలని డిమాండ్ చేస్తున్నారు .. వారు నటించే సినిమా కంటెంట్ కన్నా ముందు ఇవి కావాలని డిమాండ్ చేస్తున్నారు .. నిర్మాతలు నో చెబితే సినిమాను రిజెక్ట్ చేస్తామని బెదిరిస్తున్నారు.


ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన హీరోయిన్లు సినిమాల్లో నటించాలంటే వారి కోరికలు కొండెక్కుతున్నాయి.. అలా వచ్చిన హీరోయిన్లు 10 రోజుల షూటింగ్ అంటే లగ్జరీ హోటల్లో సూట్ రూములు బుక్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు ..  ఆ హోటల్ బిల్లులు తడిచి మోపడుతున్నాయి .. వారితో పాటు వచ్చిన వారికి కూడా ప్రత్యేకమైన రూమ్ లు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఈ రీసన్ టైమ్స్ లో సినిమా హీరోయిన్లు డైట్ను బాగా ఫాలో అవుతున్నారు.. ఆ డైట్ కోసం సపరేట్గా కొన్ని రకాల ఫుడ్స్ తింటున్నారు .. అవి ఏమి తక్కువలో వచ్చేది కూడా కాదు .. లక్షల్లో డబ్బులు కట్టాల్సిందే .. హీరోలను మించి ఫుడ్ ను తీసుకోవడంతో నిర్మాతలకు పట్టపగలే హీరోయిన్లు చేష్టలతో చుక్కలు కనిపిస్తున్నాయి. సినిమాల్లో స్టార్ హీరోయిన్గా ఉన్న కొందరు హీరోయిన్లు సెక్యూరిటీ , పర్సనల్ మేకప్ ఆర్టిస్టులు , మేనేజర్ , డిజైనర్లను ఎప్పుడు తమ వెంట తెచ్చుకుంటారు .. అయితే తమ వెనుక వచ్చిన సిబ్బందిని తమతో కాకుండా ప్రత్యేక వాహనాల్లో తీసుకురావాలని నిర్మాతలకు ముందే చెప్పి అదనపు ఖర్చులు పెడుతున్నారు.


ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన హీరోయిన్లు సినిమాలను నటించాలంటే వారితో పాటు పేరెంట్స్ లేదా కజిన్స్ కూడా వస్తారు .. వారికి ఆ హీరోయిన్లతో పాటుగా అన్ని సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది. అలా వారికి ఏది తక్కువైనా హట్‌ అవుతున్నారు .. అలా కొన్ని రోజులు షూటింగ్లకు గుడ్ బాయ్ చెప్తున్నారు మళ్ళీ నిర్మాతలు కాళ్లు బేరాలు ఆడితే దిగివస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో చిత్ర నిర్మాతల పరిస్థితి ఇది .. తెలుగులో అందమైన హీరోయిన్లు ఉన్నా కూడా ఇతర రాష్ట్రాల అందాలపై ఉన్న మోజుతో హీరోయిన్లను తీసుకువస్తున్నారు. వారి డిమాండ్స్ ను తీర్చలేక ఇబ్బందులు పడుతున్నారు. కోరి తెచ్చుకున్న వారికి కోరికలు ఎక్కువే అంటారు సినిమా పూర్తి అవ్వాలంటే ఆ కోరికలను తూచా తప్పకుండా తీచుతున్నారు.. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న నిర్మాతల పరిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి: