టాలీవుడ్ ఉన్న‌ యంగ్ హీరోల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో శ్రీ విష్ణు .. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ ఆ తర్వాత హీరోగా మారి ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు .. ఇక శ్రీ విష్ణు నటించే సినిమాలు రిజల్ట్ ఎలా ఉన్న ప్రేక్షకులకు మాత్రం మంచి వినోదాన్ని ఇస్తాయి .. ఆయన ఎంచుకునే కథలు కూడా ఎంతో కొత్తగా ఉంటాయి .. హిట్ , ప్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తారు.  ఈ రీసెంట్‌ టైమ్స్ లో వరుస‌ విజయాలు అందుకుంటున్నాడు ఈ టాలెంటెడ్ హీరో.. సామజ వర్గమున సినిమాతో ఫామ్ లోకి వచ్చిన శ్రీ విష్ణు .. ఆ తర్వాత ఓం భీమ్ బుష్ , స్వాగ్ సినిమాల తో మంచి విజయాలు అందుకున్నారు ..


 గతంలో శ్రీ విష్ణు ఓ ఇంటర్వ్యూలు చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ గా మారాయి . ఓ హీరోయిన్‌ తమ సినిమా షూటింగ్ స‌మ‌యంలో చెప్పా పెట్టకుండా బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందని వెళ్లిపోయిందట . ఈ విషయాన్ని శ్రీవిష్ణు తెలిపారు. శ్రీవిష్ణు నటించిన సినిమాల్లో ఓం భీమ్ భీష్    ప్రేక్షకులను ఎంత‌గానో  ఆకట్టుకుంది . ఈ సినిమా కామెడీ హారర్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమాలో శ్రీ విష్ణు తో పాటు రాహుల్ రామకృష్ణ , ప్రియదర్శి కూడా నటించారు. అలాగే ఈ సినిమాలో అయేషా ఖాన్ సెకండ్ హీరోయిన్ గా నటించింది . ఓం భీమ్ బుష్‌ మూవీ ప్రమోషన్ లో భాగంగా శ్రీ విష్ణు మాట్లాడుతూ.. ఆయేషా ఖాన్‌ గురించి ఆసక్తికర కామెంట్లు చేశాడు ..


సినిమా లేట్ అవ్వడానికి ఆయేషా ఖాన్ కూడా కారణమని ఆయన అన్నారు .. సినిమా షూటింగ్ సమయంలో ఉండగా చెప్పకుండా బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందని ఆమె చెప్పకుండా వెళ్ళిపోయింది .. కనీసం ఆమె సెట్‌లో ఎవరికీ చెప్పలేదని .. బిగ్ బాస్ కు వెళ్లి అక్కడ క్రేజ్‌ తెచ్చుకుందని శ్రీ విష్ణు చెప్పుకొచ్చాడు .. ఇప్పుడు ఈ కామెంట్స్ మరోసారి వైరల్ గా మారాయి .. బాలీవుడ్లో జూనియర్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించిన ఆయేషా ఖాన్ .. ఆ తర్వాత హీరోయిన్గా ఎదిగింది .. బాలీవుడ్ తో పాటు తెలుగులోను ప‌లు సినిమాల్లో నటించింది .. అలాగే పలు స్పెషల్ సాంగ్ లోను మెరిసింది .. ఈ అమ్మడు హిందీ బిగ్ బాస్ సీజన్ 17 లో పాల్గొని మంచి క్రేజ్ తెచ్చుకుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: