ఈ విధంగా 2024 సంవత్సరంలో దేశం మొత్తం ఏకం చేసిన సినిమాలు మాత్రం కేవలం తెలుగు సినిమాలే.. ప్రధానంగా 2024 మొదట్లో హనుమాన్ సినిమాతో ప్రశాంత్ వర్మ పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు.. ఆ తర్వాత మళ్లీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర మరోసారి 1000 కోట్లు సృష్టించిన హీరోగా రికార్డులు క్రియేట్ చేశాడు.. ఈ సినిమా తర్వాత మళ్లీ మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ దేవర సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 500 కోట్ల మార్క్ కలెక్షన్లతో సోలో పాన్ ఇండియా విజయాన్ని అందుకున్నారు..
ఇదే విధంగా బాలీవుడ్ లో వచ్చిన స్త్రీ 2 సినిమా కూడా హిందీ లో మంచి విజయం సాధించింది.. ఈ ఏడాదిలోనే చివర సినిమాగా వచ్చిన పుష్పా2 ఇండియన్ సినీ చరిత్రలోనే ఊహించని విధంగా రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోతుంది .. ఇప్పటికే బాలీవుడ్లో 600 కోట్లకు బయట కలెక్షన్లు క్రియేట్ చేసిన సినిమాగా రికార్డుకు ఎక్కింది .. అలాగే త్రిబుల్ ఆర్ , కే జి ఎఫ్ 2 రికార్డ్ ను కొల్లగొట్టి బాహుబలి 2 రికార్డుకు అడుగు దూరంలో నిలిచింది. ఇలా ఈ 2024 సంవత్సరంలో దేశం మొత్తాన్ని ఏకం చేసిన సినిమాగా తెలుగు చిత్ర పరిశ్రమ నిలిచింది.