వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో ఇప్పటి వరకు ఎఫ్‌ 2, ఎఫ్‌ 3 సినిమాలు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఆ రెండు సినిమాల్లో వరుణ్ తేజ్ మరో హీరోగా నటించడంతో పాటు దిల్‌ రాజు నిర్మాతగా వ్యవహరించిన విషయం తెల్సిందే. మూడో సారి వెంకటేష్‌తో అనిల్ రావిపూడి సినిమాను చేస్తున్నారు. ఈసారి సోలో హీరోగా వెంకటేష్ నటిస్తున్నారు. నిర్మాత మాత్రం మారలేదు. దిల్‌ రాజు మరోసారి వెంకీ, అనిల్ రావిపూడి కాంబో మూవీని నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలోనే వచ్చే ఏడాది సంక్రాంతికి తమ సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం' విడుదల చేస్తామంటూ అనిల్ రావిపూడి అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే.ఇదిలావుండగా కమర్శియల్ చిత్రాలతో హిట్ అందుకోవడం నేటి జనరేషన్ దర్శకుల్లో అనీల్ కే చెల్లింది. సీనియర్ హీరోలంతా అతడితో నటించడానికి ఆసక్తి చూపిస్తుంటారు.అయితే ఇండస్ట్రీలో సక్సెస్ వచ్చిన తర్వాత ఓ ఫెయిల్యూర్ ఎదురైతే డైరెక్టర్ పరిస్థితి ఎలా ఉంటుందన్నది వివరించాడు. 'వరుస విజయాలు ఎన్ని వచ్చినా? ఒక్క ప్లాప్ ఎదురైంది అంటే ఆ డైరెక్టర్ పాతాళానికి పడిపోవాల్సిందే.

డైరెక్టర్ వైపు హీరో, నిర్మాతలు చూసే పరిస్థితి ఉండదన్నారు. అప్పటి వరకు రాసుకుపూసుకుని తిరుగిన వారు కూడా ముఖం చాటేస్తారు. ఇక్కడ హిట్లు ఉంటేనే అవకాశాలు ఉంటాయి. లేదంటే? దుకాణం సర్దుకుని వెళ్లి పోవా ల్సిందే. ఇండస్ట్రీలో ఏ రోజు ఎలా ఉంటుందో కూడా చెప్పలేం. ఇది సెక్యూర్ లైఫ్ కాదు. ఫాంలో ఉన్నంత కాలం సినిమాలు చేసుకుంటూ వెళ్లడమే. అది పోయిన తర్వాత అవకాశాలు రాలేదన బాధపడకూడదు' అన్నారు.ఇదిలావుండగా సంక్రాంతి కి వస్తున్నాం సినిమా సంక్రాంతికి రాబోతున్న విషయం తెల్సిందే. సంక్రాంతికి ఉన్న పోటీ నేపథ్యంలో ఈ సినిమాను రంగంలోకి దించి, అందుకు తగ్గట్లుగా జనాల్లోకి సినిమాను తీసుకు వెళ్లాలి అంటే ఇలాంటి ట్రిక్స్‌ వాడాలి అనే విషయం దర్శకుడు అనిల్‌ రావిపూడికి బాగా తెలుసు. అందుకే విభిన్నంగా ఉండాలి అనే ఉద్దేశ్యంతో తాజాగా ఈ సినిమా గురించి పెట్టిన ప్రెస్‌మీట్‌లో నటీ నటులను కాకుండా పాత్రలను తీసుకు వచ్చారు. చీర కట్టులో ఐశ్వర్య రాజేష్‌, పోలీస్‌ ఆఫీసర్‌ గా మీనాక్షి చౌదరి ఆకట్టుకున్నారు. ఇక వెంకటేష్ గడ్డంతో పాటు పంచెలో కనిపించారు. మొత్తానికి ఈ ఐడియా భలే ఉందని అంతా అనిల్‌ రావిపూడి ఐడియాకి ఫిదా అయిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: