అడివి శేష్ గూఢచారి సినిమాకు కీబోర్డ్ ప్లేయర్గా శ్రీ చరణ్ పాకాల తెచ్చి పెట్టుకున్నాడట .. అయితే షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటున్న సమయంలోనే ప్రదీప్ మద్దాలి పరిచయం అయ్యాడు .. ఆ సమయంలో జగన్ నాటకం అన్ని ప్రాజెక్టుకి పని చేశాడట. మిస్సింగ్ మూవీలో ఓ బీజీఎం బిట్ విన్న నిర్మాత బన్నీవాస్‌కి నచ్చడంతో ఆయ్ సినిమాలో అవకాశం ఇచ్చారట .. ఈ విధంగా ఆయ్ సినిమా అజయ్ కెరియర్ కు బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. క్షీరసాగర మధనం, నేడే విడుదల, మిస్సింగ్, శ్రీరంగనీతులు వంటి సినిమాలు తో పాటుగా సేవ్ ది టైగర్స్ సీజన్ వన్ సీజన్ 2 వికటి కవి వెబ్ సిరీస్ లకు పనిచేశారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్ లో తనకి దేవిశ్రీ ప్రసాద్ అంటే ఇష్టమని ఆయన చెప్పాడు .. ప్రస్తుతం ఆహాలో త్రీ రోజెస్ సీజన్ 2 తో పాటు, మరో రెండు వెబ్ సిరీస్ లకు వర్క్ చేస్తున్నాడట. పలు సినిమాలకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయనిట..
ఇక త్వరలోనే అజయ్ అరసాడ సినిమాలకు సంబంధించిన వివరాలు కూడా బయటకు రానున్నాయి. ఇప్పుడు మొత్తానికి టాలీవుడ్ లో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచేలా ఈ మ్యూజిక్ డైరెక్టర్ కనిపిస్తున్నాడు. వైజాగ్ లో పుట్టి పెరిగిన అజయ్ .. గీతం యూనివర్సిటీలో మ్యూజిక్ బ్యాండ్ టీమ్లతో కలిసి తిరిగేవారట.. చిన్నతనం నుంచి ఇంట్లో ఎక్కువగా సంగీతం గురించి చర్చిలు ఉండటంతో అలా సంగీతంపై మక్కువ ఏర్పడిందని ఆయన చెబుతూ ఉంటాడు .. అలాగే టిసిఎస్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా 2011 నుంచి 18 వరకు జాబ్ చేశాడట .. కానీ మ్యూజిక్ సినిమాల మీద ఇంట్రెస్ట్ తో ఉద్యోగం వదిలేసి షార్ట్ ఫిలిమ్స్ సినిమాలు వెబ్ సిరీస్ లు అంటూ ప్రస్తుతం టాలీవుడ్ లోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.