పుష్ప2 : అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న విడుదలై భారీ కలెక్షన్లతో రికార్డులు క్రియేట్ చేస్తుంది. రిలీజ్ అయిన ఒక గంటలోనే సుమారు లక్షకు పైగా టిక్కెట్లు అమ్ముడు అవ్వటం విశేషం. కల్కి: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఈ సినిమా మొదటిరోజు గంటకు 96 వేలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి . దేవర: మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వి కపూర్ జంటగా నటించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవలో సెప్టెంబర్ 27న రిలీజ్ అయింది .. ఈ సినిమా కోసం మొదటి రోజు సుమారు 15 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైపోయాయి.
స్త్రీ-2: ఆగస్టు 15న విడుదలైన ఈ హిందీ సినిమా మొదటి రోజు సుమారు లక్షా ఇరవై నాలుగు వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడు పోయాయి. సినిమా టికెట్లుభూల్ భులయ్య-3: ఈ హిందీ చిత్రం నవంబరు 1న విడుదలైంది. కార్తీక్ ఆర్యన్, విద్యా బాలన్, మాధురి దీక్షిత్ ప్రధాన తారాగణం. చిత్రం ఓపెనింగ్ రోజు 2,29,558 టిక్కెట్లు అమ్మారు. బాక్సాఫీ వద్ద అత్యధిక వసూళ్లు చేసిన రెండో హిందీ చిత్రం, ఐదో భారతీయ సినిమాగా నిలిచింది.అమరన్: శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన ఈ చిత్రం అక్టోబరు 31న విడుదలైంది. చిత్రం విడుదల రోజున తొలి నాలుగు గంటల్లో 1,36, 890 టిక్కెట్లు విక్రయించారు.
ఫైటర్: హృతిక్ రోషన్, దీపికా పదుకొనే జంటగా నటించిన ఈ హిందీ చిత్రం జనవరి 25 విడులైంది. తొలి రోజు 2,79,00 టిక్కెట్లు విక్రయించారు.హనుమాన్: తేజ సజ్జా, అమృత అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కింది. జనవరి 12న విడుదల కాగా తొలిరోజున 3,36,000 టిక్కెట్లు అమ్మారు.ద గోట్: విజయ్ నటించిన ఈ సినిమా సెప్టెంబరు 5న విడుదలైంది. తొలి రోజు ఒక్క తమిళనాడులోనే ఆరు లక్షలకు పైగా టిక్కెట్లు విక్రయించారు. ద సింగమ్ ఎగైన్: అజయ్ దేవ్‌గన్, రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే ప్రధాన తారాగణంగా నటించిన ఈ మూవీ నవంబరు 1న విడుదలైంది. 2,26,000 టిక్కెట్లు విక్రయించారు.