అల్లు అర్జున్ పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో ఎలా హాట్ టాపిక్ గా ..టాక్ ఆఫ్ ది టౌన్గా మారిపోయిందో మనందరికీ తెలిసిందే. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన లో రేవతి అనే మహిళ మృతి చెందిన కారణం గా అల్లు అర్జున్ ని నిందితుడిగా భావిస్తూ తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు . ఈ రాద్ధాంతం గురించి మనం గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో టెలివిజన్ రంగంలో వింటూనే ఉంటున్నాం . అయితే రీసెంట్ గా ఈ కేసు ఊహించని మలుపులు తిరుగుతూ అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసుల ఎంక్వయిరీ లో పాల్గొన్నారు .


అయితే అల్లు అర్జున్ ఎక్కువగా చేతులెత్తి దండం పెడుతూ కనిపించిన దృశ్యాలు ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అవుతున్నాయి . మరీ ముఖ్యంగా సంధ్యా థియేటర్ కి వెళ్లేటప్పుడు అల్లు అర్జున్ దండం పెట్టాడు అంటే ఒక రీజన్ ఉంది . సినిమా సూపర్ హిట్ చేసినందుకు థాంక్స్ చెప్తూ అభిమానులకు రెస్పెక్ట్ ఇస్తున్నట్లుగా భావించొచ్చు. అయితే పోలీసులు అరెస్ట్ చేస్తున్న మూమెంట్ లో.. అదే విధంగా ప్రెస్ మీట్ లోనూ.. అదే విధంగా బెయిల్ మీద రిలీజ్ అయిన తర్వాత .. ఇప్పుడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర దిగిన మూమెంట్ లో అల్లు అర్జున్ రెండు చేతులెత్తి దండం పెట్టిన దృశ్యాలు బాగా హైలైట్ గా మారాయి.



అయితే చాలామంది ఇది అల్లు అర్జున్ అభిమానులకు జనాలపై రెస్పెక్ట్ చూయిన్నారు అంటూ మాట్లాడుకుంటుంటే మరికొందరు బన్నీ హేటర్స్ మాత్రం అది అభిమానం కాదు అని ఆయన భయంతో తన భయాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఇలా చేస్తున్నాడు అని.. అది రెస్పెక్ట్ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లేనని మాట్లాడుకుంటున్నారు.  ఒకప్పుడు అల్లు అర్జున్ గురించి నెగిటివ్ గా మాట్లాడాలి అంటేనే భయపడేవారు .. ఇప్పుడు అల్లు అర్జున్ ని అమ్మనా బూతు పదాలతో ట్రోల్ చేస్తున్నారు జనాలు. దీన్నంతటికీ కారణం పుష్ప2 సినిమా అని చెప్పుకోక తప్పదు అంటున్నారు జనాలు..!

మరింత సమాచారం తెలుసుకోండి: