ఆ తర్వాత అల్లు అర్జున్ బెయిల్ పైకి వచ్చాడు. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ..అల్లు అర్జున్ పేరు ప్రస్తావిస్తూ కొన్ని హాట్ కామెంట్స్ చేశాడు. దీంతో వెంటనే అల్లు అర్జున్ కోపంతో ప్రెస్ మీట్ పెట్టి మరి నాపై కావాలనే కుట్ర చేస్తున్నారు అనే విధంగా పరోక్షంగా స్పందించారు . అక్కడే అల్లు అర్జున్ అడ్డంగా బుక్కయ్యాడు . దీంతో వెంటనే సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన మినిట్ టూ మినిట్ వీడియో ని రిలీజ్ చేశారు తెలంగాణ పోలీసులు . ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా మిస్టేక్ మొత్తం బన్నీదే అంటూ అర్థం అయిపోయింది .
దీంతో బన్నీ పేరు సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోల్లింగ్ కి గురి అవుతుంది . రీసెంట్గా చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ కు నోటీసులు కూడా పంపించారు. ప్రజెంట్ ఇప్పుడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాడు అల్లు అర్జున్ . సంధ్య థియేటర్లో ఏం జరిగింది? అసలు ఎందుకు మీరు పర్మిషన్ లేకపోయినా అక్కడికి వెళ్లారు..? అన్న ప్రశ్నలకి జవాబు తెలుసుకోవడానికి పోలీసులు బన్నీని ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే బన్నీ తన లాయర్ అశోక్ రెడ్డితో ఈ ఎంక్వయిరీ కి హాజరయ్యారు .
అయితే నిన్న అర్ధరాత్రి నుంచి అల్లు అర్జున్ ని ఫుల్ గా రెడీ చేసారు లాయర్స్ అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. పోలీసులు ఏం అడుగుతారు..? దానికి ఎలా సమాధానం చెప్పాలి..? అనే రేంజ్ లో ప్రిపేర్ అయ్యారట . ప్రతి విషయాన్ని కూడా లాయర్ క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్పారట. అంతేకాదు బన్నీ నోటి నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక పదం వాడనే వాడకూడదు అంటూ ఓపెన్ గా స్ట్రైట్ గా చెప్పేసారట . ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మేము శ్రీ తేజకు డబ్బులు ఇస్తాము ..అడిగినంత డబ్బులు ఇవ్వగలము మేము ..వాళ్లకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా మేము చూసుకుంటాము అనే విషయాలను డైరెక్ట్ గా అసలు మాట్లాడకూడదట. ఒకవేళ మాట్లాడితే అది కచ్చితంగా లంచం కిందకు పరిగణిస్తూ అల్లు అర్జున్ పై ఇంకా చాలా చాలా సెక్షన్ల కింద కేసు నమోదు చేసే విధంగా పరిస్థితి పోలీసుల కంట్రోల్లోకి వెళ్లిపోతుందట. ఎక్కడ కూడా శ్రీ తేజ్ వాళ్ళ కుటుంబం కు డబ్బులు ఇస్తాము అన్న విధంగా అసలు మాట్లాడకూడదట . ఇదే విషయాన్ని లాయర్స్ పదే పదే నొక్కి మరి అల్లు అర్జున్ కి వివరించారు. ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా వైరల్ అవుతుంది..!