ఈ వీడియో ఆధారంగా పోలీసులు బన్నీని ప్రశ్నించే అవకాశం అయితే ఉంది. బన్నీ నిర్వహించిన ప్రెస్ మీట్ గురించి కూడా పోలీసులు విచారించనున్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర పోలీసులు భారీ బందో బస్ట్ ఏర్పాటు చేశారని సమాచారం అందుతోంది. బన్నీ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతుండటం ఫ్యాన్స్ ను ఎంతగానో బాధపెడుతోంది. అల్లు అర్జున్ కు పర్సనల్ కెరీర్ పరంగా అనుకూల పరిస్థితులు లేవు.
అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబో మూవీ ఎప్పుడు మొదలవుతుందో అనే చర్చ జరుగుతోంది. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి చాలా సమయం పట్టనుంది. ఈ కేసు విషయంలో రాబోయే రోజుల్లో మరిన్ని మలుపులు చోటు చేసుకునే ఛాన్స్ ఉంది. రేవతి భర్త కేసును విత్ డ్రా చేసుకుంటే మాత్రం అల్లు అర్జున్ ఈ వివాదం నుంచి బయటపడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
స్టార్ హీరో అల్లు అర్జున్ ఈ దారిలో వెళ్తారా అనే చర్చ జోరుగా జరుగుతుండటం గమనార్హం. మరోవైపు బన్నీ ఇంటి చుట్టూ పరదాలు ఏర్పాటు చేస్తున్నారని తెలుస్తోంది. బన్నీ ఇంటిపై మరోసారి దాడి జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేస్తున్నట్టు తెలుస్తోంది. స్టార్ హీరో అల్లు అర్జున్ పై సోషల్ మీడియా వేదికగా క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. బన్నీ క్రేజ్ మాత్రం మామూలుగా లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.