పాపం అల్లు అర్జున్ తెలిసి చేశాడో తెలియక చేసాడో తెలియదు కానీ అనవసరంగా సంధ్యా థియేటర్ కు వెళ్లి అడ్డంగా ఇరుక్కుపోయాడు . పుష్ప2 బెనిఫిట్ షో సందర్భంగా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ జనాలు ఆయనను చూడడానికి భారీ సంఖ్యలో హాజరయ్యారు.  ఇంకా పక్కాగా చెప్పాలంటే ఎగబడి పోయారు.  దీంతో భారీ తొక్కిసలాట జరిగింది.  అయితే ఆ తొక్కిసలాటలో బన్నీ ఫ్యాన్ రేవతి అనే మహిళ మృతి చెందింది. ఈ ఘటన వల్ల అల్లు అర్జున్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు . ఈ ఘటన తర్వాత అల్లు అర్జున్ పేరు దేశవ్యాప్తంగా ట్రోలింగ్కి గురవుతుంది . మరీ ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఇష్యూ ని చాలా సీరియస్ గా తీసుకున్నాడు .


అసెంబ్లీలో బన్నీపై పరోక్షకంగా చాలా చాలా ఘాటుగా విమర్శలు చేశారు . దీంతో ఈ వివాదం తారాస్థాయికి చేరిపోయింది . అయితే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తప్పు అంటూ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మరి కడిగి పడేశాడు . షాకింగ్ ఏంటంటే బన్ని చెప్పినవన్నీ అబద్ధాలే అంటూ వెంటనే పోలీసులు ఒక వీడియోని కూడా రిలీజ్ చేశారు . అయితే ఈ ఇష్యూలో సుకుమార్ ని కూడా లాగుతున్నారు జనాలు . కొంతమంది డైరెక్టర్ సుకుమార్ కారణంగానే ఇదంతా జరిగింది అని సినిమా ప్రమోషన్స్ అంటూ అల్లు అర్జున్ మైండ్ మొత్తం టెన్షన్ క్రియేట్ చేసే విధంగా చేసేసాడు అని మాట్లాడుతున్నారు . అంతేకాదు అల్లుఅర్జున్ అరెస్ట్ అయిన తర్వాత సుకుమార్ కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు .అయితే రీసెంట్గా సుకుమార్ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు.



ఈవెంట్ లోనే సినిమాలోని "ధోప్" అనే సాంగ్ ని కూడా రిలీజ్ చేశారు . అయితే ఈ పాట గురించి యాంకర్ సుమ.. సుకుమార్ ని ప్రశ్నిస్తూ "మీరు ఒకవేళ ధోప్ (అంటే వదిలిపెట్టడం అని అర్థం) వదిలేయాలి అంటే ఈరోజుతో ఏం వదిలేస్తారు..?" అని అడుగుతుంది . అప్పుడే సుకుమార్ ఏకంగా సినిమాని వదిలేద్దాం అనుకుంటున్నాను అంటూ చెప్పుకొస్తాడు.  దీంతో పక్కనే కూర్చుని ఉన్న రాంచరణ్ షాక్ అయిపోతాడు . వెంటనే మైక్ లాక్కుని మీరు అలా చేయలేరులే అంటూ తనతో కమిట్ అయిన సినిమాకు సంబంధించిన విషయాన్ని పరోక్షకంగా గుర్తు చేస్తాడు.



దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  అయితే అల్లు అర్జున్ ఇప్పుడు ఊహించని చిక్కుల్లో ఇరుక్కున్నాడు.  ఒకవేళ నిజంగానే అల్లు అర్జున్ అరెస్ట్ అయితే పదేళ్లు జైలు శిక్ష పడుతుంది అంటూ లాయర్లు చెబుతున్నారు . ఒకవేళ అల్లు అర్జున్ నిజంగానే అరెస్టయి జైలుకు వెళ్లి పదేళ్లు శిక్ష అనుభవిస్తే మాత్రం సుకుమార్ నిజంగానే సినిమాలను వదిలేసే ఛాన్స్ కూడా ఉంది అంటున్నారు సుకుమార్ అభిమానులు . అయితే చాలామంది పుష్ప2 సినిమా కారణంగా అల్లు అర్జున్ కెరియర్ సర్వనాశనం అయిపోయింది అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు...!

మరింత సమాచారం తెలుసుకోండి: