నందమూరి బాలకృష్ణ ఒకవైపు సినిమాలు, మరొకవైపు రాజకీయాలు, అలాగే ఆహాలో ప్రసారమయ్యేటువంటి అన్ స్టాపబుల్ షో తో సక్సెస్ ఫుల్ గా ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే మూడు సీజన్లను కూడా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నాలుగవ సీజన్ జరుగుతున్న సందర్భంగా ఈ సీజన్లో కూడా చాలామంది సెలబ్రిటీలతో పాటు డైరెక్టర్లను తీసుకురావడానికి సిద్ధమయ్యింది ఆహ టీమ్.ఇక బాలయ్య కూడా షోలోకి ఎంట్రీ ఇచ్చిన వారందరినీ కూడా ఆటపట్టిస్తూ అలరిస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ ఉంటారు. అలాగే వారి యొక్క తెలియని వ్యక్తిగత విషయాలను కూడా పంచుకునేలా చేస్తూ ఉంటారు బాలయ్య.



తాజాగా ఇప్పుడు బాలయ్య షోకు ఫ్యామిలీ హీరోగా పేర్కొందిన విక్టరీ వెంకటేష్ హాజరయ్యారు. అందుకు సంబంధించి ప్రోమో కూడా ఇప్పుడు వైరల్ గా మారుతున్నది. ఇద్దరు కూడా ఒకప్పటి జ్ఞాపకాలను గుర్తుకు చేస్తూ తెలుగు సినీ పరిశ్రమకు నాలుగు స్తంభాలుగా ఉండే వాళ్లమని చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ పాత ఫోటోలను సైతం ఒకటి చూపించి గుర్తు చేసుకున్నారు. అలాగే ఈ షో కి వెంకటేష్ సోదరుడు సురేష్ బాబు కూడా రావడం జరిగింది.


ఇక సురేష్ బాబు తో కూడా కొన్ని ఫన్నీ ప్రశ్నలు వేసిన బాలయ్య ఆ తర్వాత వెంకటేష్, సురేష్ బాబు జీవితంలో జరిగిన కొన్ని ఎమోషనల్ విషయాలను కూడా తెలుసుకోవడం జరిగింది. అయితే వీటిని మ్యూట్ చేసిన ఫుల్ ఎపిసోడ్ ల చూపిస్తారు. ఇక వెంకటేష్ కూతుర్ల గురించి అడుగుతూ అలాగే మేనల్లుడు నాగచైతన్య గురించి కూడా పలు ప్రశ్నలు వేయడం జరిగింది బాలయ్య. అయితే చివరిలో టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావు పూడి కూడా ఇందులో చూపించడం జరిగింది. మొత్తానికి బాలయ్య షోలో వెంకటేష్ సందడి ప్రేక్షకులను కనువిందుగా మారుస్తోంది.. వెంకటేష్ ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో నటిస్తున్నారు బాలయ్య డాకు మహారాజ్ సినిమాలో నటిస్తున్నారు. ఇవి కూడా సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: