పుష్ప టు విడుదల సమయంలో జరిగిన ఘటన పూర్తిగా అల్లు అర్జున్ మెడకి చుట్టుకుంది.అయితే అల్లు అర్జున్ ఒక్కడినే నిందితుడిగా చేర్చడం సరైన పద్ధతి కాదు అంటూ ఇప్పటికే విపక్షాలు మాట్లాడుతున్నప్పటికీ చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఒక అల్లు అర్జున్ అనే వాడు అక్కడికి రాకపోతే ఆరోజు అంత ఘోరం జరిగేది కాదని ఒక తల్లి నిండు ప్రాణాలు పోయేవి కాదని, ఒక కొడుకు చావు బతుకుల మధ్య పోరాడే వాడు కాదు అని చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ ఒకరోజు జైలు జీవితం కూడా గడిపాడు. ఇక ఈరోజు కూడా అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరిపారు. ఇక ఎవరైనా సరే చట్టం ముందు సమానమే అనే రీతిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే ఈ కేసు నుండి అల్లు అర్జున్ ని బయటకు తీసుకురావడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. అటు మెగా ఫ్యామిలీతో పాటు ఇటు అల్లు ఫ్యామిలీ అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే తాజాగా సినీ ఇండస్ట్రీ నుండి ఒక రూమర్ వినిపిస్తోంది. అదేంటంటే అల్లు అర్జున్ ఈ కేసు నుండి పూర్తిగా బయటపడడం కోసం చిరంజీవి పావులు కలుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ కోసం చిరంజీవి ఏకంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిసినట్టు టాక్ వినిపిస్తోంది.చిరంజీవి సోనియాగాంధీని కలిసి ఈ విషయం గురించి ప్రస్తావించగా సోనియా గాంధీ ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని తెలుస్తోంది.

అంతేకాదు దీని గురించి పెద్దగా మాట్లాడుకోవడం వద్దు. మీ తరఫున పోరాడితే ప్రజల్లో మేం బ్యాడ్ అవుతాం అంటూ సోనియాగాంధి చెప్పిందట. అయితే ఇప్పటికే రేవంత్ రెడ్డి ఎవరు ఎన్ని చెప్పినా కూడా వినిపించుకునే పరిస్థితిలో లేరని తెలుస్తోంది. అందుకే ఆయన చట్టం ఎవరికి చుట్టం కాదు అనే విధంగా నడుచుకుంటున్నారు.ఇక సోనియా గాంధీతో మాట్లాడిన కూడా ఫలితం లేకపోవడంతో అల్లు అర్జున్ ని ఆ దేవుడే బయటపడేయ్యాలి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.మరి చిరంజీవి సోనియాగాంధీని అల్లు అర్జున్ కోసం కలిసినట్టు వస్తున్న వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది

మరింత సమాచారం తెలుసుకోండి: