ఇంకా ఆయన మాట్లాడుతూ... బన్నీ ప్రెస్ మీట్ పెట్టడానికి వీలు లేనప్పుడు, సీపీ వీడియోలు విడుదల చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం కావాలనే హీరోపైన కక్షగట్టినట్లు ప్రవర్తించడం కరెక్ట్ కాదని, ఈ కేసుకి సంబంధించి ప్రభుత్వం కావాలని సెన్సేషన్ చేస్తోందని, తీర్చాల్సిన వాగ్దానాలను పక్కనబెట్టి, జనాలకు అన్యాయం చేస్తూ... డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆరోపించారు. మరోవైపు న్యాయస్థానం ఇప్పటికే 30 రోజుల బెయిల్ ఇచ్చినందున పోలీసులు ఏ వ్యక్తి పైన అయినా ఇలా ప్రతీకారం తీర్చుకోవచ్చా? అంటూ రఘునందన్ రావు ప్రశ్నించారు.
ఇకపోతే, మరోవైపు పుష్ప పార్ట్ 2 సినిమాని వివాదాలు చుట్టుముడుతుంటే... ఓ వైపు కలెక్షన్ల విషయంలో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ బాలీవుడ్ బడాబాబుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తోంది. విషయం ఏమిటంటే యావత్ ఇండియన్ సినిమాలోనే కేవలం ఒక్క హిందీ భాషలోనే ఇప్పటివరకు 700 కోట్లకు పైనే కలెక్షన్లు రాబట్టినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే 1700 కోట్లకు పైనే కలెక్షన్లు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ మీరు ఈ సినిమా చూసుంటే సినిమా ఎలా ఉందో కింద కామెంట్ చేయండి.