సినిమాల్లో హీరోలు అప్పుడప్పుడు గొంతును సవరించుకోవడం ఎంతో కామన్ .. రెగ్యులర్గా పాడేవారు కొందరు ఉంటారు..  అప్పుడప్పుడు పాడేవారు కూడా ఉంటారు .. అయితే సీనియర్ హీరోలు ఇప్పుడు పాడటం అనేది ఎంతో అరుదు .. మెగాస్టార్ చిరంజీవి మంచి క్రేజ్ లో ఉన్నప్పుడు .. తమ్ముడు ఓ తమ్ముడు అంటూ ఓ పాట పాడారు . నాగార్జున అయితే ఇదే  వీటి జోలికి అసలు వెళ్లలేదు .. విక్టరీ వెంకటేష్ కూడా గతంలో గురు సినిమాలో ఓ చిన్న ప్రయత్నం చేశాడు .
 

కానీ ఇప్పుడు వెంకీ మామ ఓ ఫుల్ సాంగ్ పడబోతున్నాడు .. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉండబోతుందట .. ఇది కూడా ఓ పక్క సంక్రాంతి పాట అన్నట్టు తెలుస్తుంది .  ఈ పాటను విక్టరీ వెంకటేష్ ఇప్పటికే పాడేసారని కూడా తెలుస్తుంది .. ఇప్పటికే ఈ సినిమా కోసం ఒకప్పటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగులను తీసుకువచ్చారు .. ఇప్పటికే రిలీజ్ అయిన ఆ పాట ఎంతో సూపర్ హిట్ అయింది .. ఇప్పుడు వెంకటేష్ చేత కూడా పాట పాడించేశాడు సంగీత దర్శకుడు బీమ్స్ .. దర్శకుడు అనిల్ రావిపూడి ..

 

నిజానికి వెంకటేష్ దగ్గర్నుంచి తెలుగు మాటలు కన్నా ఇంగ్లీష్ ఎక్కువ వస్తుంది ఆయన ప్రసంగాల్లో .. ఇప్పుడు ఆయన పాడిన పాటలో కూడా ఎక్కువగా ఇంగ్లీష్ పదాలు ఉంటాయని తెలుస్తుంది .. ఇక త్వరలోనే ఈ పాటను కూడా రిలీజ్ చేయబోతున్నారట .. ఈ పాటకు సంబంధించిన షూటింగ్ను ఈ రోజే కంప్లీట్ చేసినట్టు తెలుస్తుంది .. వచ్చే సంక్రాంతి కానుకగా వెంకటేష్ , అనిల్ రావుపూడి కాంబోలో వస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది .. ఇప్పటికే వెంకటేష్ కు మంచి విజయాలు ఇచ్చిన అనిల్ రావిపూడి .. ఈ సినిమాతో వెంకీ మామకు ఎలాంటి సక్సెస్ ఇస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: