ఇక నుంచి ప్రీమియర్ షోలకి అనుమతులు .. బెనిఫిట్ షోలకి పర్మిషన్స్ .. టికెట్ రేట్లపై పెంపులు ఉండవు .. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పైన ఇప్పుడు ఆసత్యకరమైన చర్చ జరుగుతుంది .. ఇక ఈ నిర్ణయం రాబోయే సినిమాలు పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది .. టాలీవుడ్ లో రోజురోజుకు మారుతున్న పరిస్థితులపై ఎక్స్క్యూటివ్ రిపోర్ట్ ఇక్కడ చూద్దాం.. తెలుగు చిత్ర పరిశ్రమలో చోటుచేసుకుంటున్న పరిస్థితుల్లో రోజురోజుకు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.. మరి ప్రధానంగా గవర్నమెంట్ తీసుకుంటున్న నిర్ణయాలు చర్చనీయాంశం అవుతున్నాయి. అల్లు అర్జున్ ఇష్యూ తో ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ పై కాస్త కఠినంగా మారుతున్నట్లు అర్థమవుతుంది.


అయితే ఇది ఇండస్ట్రీ భవిష్యత్తు పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది .. తెలంగాణలో ప్రభుత్వం ఏదైనా ఇండస్ట్రీకి ఎప్పుడు ఎంతో సపోర్టుగానే ఉండేది. అలానే సినిమాలను ప్రోత్సహిస్తూనే ఉన్నారు .. అలాగే టాలీవుడ్ కోసం ఏం చేయాలో అన్ని చేస్తూ వచ్చారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక .. సలార్ , దేవర కల్కి లాంటి సినిమాలుకు భారీగా టికెట్ రేట్లు పెంచుకోవడానికి వెసులుబాటు ఇచ్చారు .. ఇక పుష్ప2కు అయితే మునిపెన్నడు ఎప్పుడు లేనంతగా ఏకంగా ప్రీమియర్స్ పైన 800 రూపాయలకు హాక్ ఇచ్చంది ప్రభుత్వం .. పుష్ప 2 రిలీజ్ వరకు అంతా బాగానే ఉంది. కానీ ఆ తర్వాత జరిగిన కొన్ని అనుకోని సంఘటనతో పరిస్థితులని ఒక్కసారిగా ఊహించిన విధంగా మారిపోయాయి.


ముఖ్యంగా సంధ్యా ధియేటర్ ఘటన తర్వాత ప్రభుత్వం సీరియస్గా మారింది.. ఇకపై ఏ సినిమాకు బెనిఫిట్ షోస్ ఉండవని .. టికెట్ రేట్లు పెంపు కూడా ఉండదని ఆదేశాలు కూడా ఇచ్చింది .. ఈ ప్రభుత్వ నిర్ణయం రాబోయే పెద్ద సినిమాలపై గట్టి ప్రభావం చూపించక మానదు. మరియు ముఖ్యంగా సంక్రాంతికి వస్తున్న గేమ్ చేంజర్ పైనే ఈ ఎఫెక్ట్ గట్టిగా పడనుంది .. అలాగే మిగిలిన సినిమాల పైన కూడా ఎంతోకంత ప్రభావం చూపనుంది .. అయితే ఇప్పుడు ఈ ఇష్యూ పై సినిమా పెద్దలు మాట్లాడతారా..? లేక ఒకవేళ సైలెంట్ గా ఉంటే ఏపీలో బెనిఫిట్ షోలో టికెట్ రేట్ పెంపుకు అనుమతులు ఆపేస్తే ఏంటి అనే ఊహే టాలీవుడ్ ఫ్యూచర్ ను గందరగోళంలో పడేస్తుంది. మరి ఈ వ్యవహారం తెలుగు చిత్ర పరిశ్రమకు రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: