గ్లోబల్ స్టార్ గా పేరుపొందిన టాలీవుడ్ హీరో రామ్ చరణ్ , బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వాని నటిస్తున్న తాజా చిత్రం గేమ్ ఛేంజర్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శంకర్ పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించారు. ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమాని నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన అప్డేట్లు సైతం అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి.గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా దేశాలలో చేశారు. అక్కడికి వచ్చిన కొంతమంది సెలబ్రిటీలు కూడా ఈ సినిమా చూసామని..గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్ నటన అద్భుతంగా ఉందని ఇంటర్వెల్ సన్నివేశాలు హైలెట్గా ఉంటాయని కూడా తెలిపారు.



పాటలకు కూడా అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన దోప్ లిరికల్  సాంగ్ కూడా సోషల్ మీడియాలో తెగ ట్రెండీ గా మారుతోంది. ఇందులో రామ్ చరణ్, కీయారా మాస్ స్టెప్పులతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ క్రమంలోనే ఈ సాంగ్ కోసం హీరోయిన్ కీయారా అద్వాని ఎంత కష్టపడిందనే విషయాన్ని  సోషల్ మీడియాలో ప్రాక్టీస్ వీడియోని షేర్ చేయడం జరిగింది. ఈ వీడియో చూసిన అభిమానులు అందరూ ఆశ్చర్యపోతున్నారు.


సినిమా షూటింగ్ సెట్లో 13 రోజులపాటు ఈ సినిమాను షూట్ చేయడం జరిగిందట. అలా కొత్త స్టెప్పులతో డాన్స్ క్లాసికల్, రోబోటిక్ ఇతరత్రా వంటి విధానాన్ని కూడా నేర్చుకున్నట్లుగా తెలియజేసింది. ఈ వీడియో చూసిన అభిమానులు సైతం రామ్ చరణ్ సక్సెస్ కోసం కియారా ఇంత కష్టపడుతోందేంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది రాబోయే రోజుల్లో ఈ సినిమాలో మరిన్ని అద్భుతాలు చూస్తారు అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. మరి భారి అంచనాల మధ్య జనవరి 10వ తేదీన రాబోతున్న ఈ సినిమా ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి. ప్రస్తుతం అయితే ఈ వీడియో వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: