కాగా సంధ్య థియేటరల్ తొక్కిసలాట కేసులో హీరో అల్లు అర్జున్ ఏ11 ముద్దాయిగా ఉన్నాడు. దీనికి సంబంధించి ఇప్పటికే జైలు కు వెళ్లి మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చాడు బన్నీ. మంగళవారం డిసెంబర్ 24 మళ్లీ హైదరాబాద్ చిక్కడ పల్లి పోలీసులు విచారణకు పిలిచారు. ఈ నేపథ్యంలో శ్రీతేజ్ తండ్రి భాస్కర్ మాట్లాడుతూ అల్లు అర్జున్ పై కేసు వాపసు తీసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు.
కాగా గతంలోనూ ఇదే విషయం చెప్పారు భాస్కర్. అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు ఈ కేసును ఉపసంహరించుకుంటానని స్టేట్ మెంట్ ఇచ్చాడు. తన భార్య, కుమారుడు అల్లు అర్జున్ అభిమానులని, అందరితో పాటే తామూ కు వెళ్లామన్నాడు. రేవతి మృతికి, అల్లు అర్జున్ కు ఎలాంటి సంబంధం లేదని భాస్కర్ తెలిపాడు. పుష్ప 2 చూసేందుకు ఆరోజు అల్లు అర్జున్ తో పాటు చాలామంది థియేటర్ కు వచ్చారని భాస్కర్ చెప్పుకొచ్చాడు.ఇదిలావుండగా తాజాగా శ్రీతేజ్‌ను ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు పరామర్శించారు. భాస్కర్‌ను చిత్ర పరిశ్రమలోకి తీసుకొచ్చి, అతనికి శాశ్వత ఉద్యోగాన్ని కల్పించాలని భావిస్తోన్నానని, ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లానని దిల్ రాజు అన్నారు. చిత్ర పరిశ్రమను ప్రభుత్వం దూరం పెట్టిందని చెబుతున్నారని, ఇందులో వాస్తవం లేదని దిల్ రాజు పేర్కొన్నారు. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం అన్ని రకాలుగా ఇండస్ట్రీకి అండగా నిలబడుతుందని హామీ ఇచ్చారు.