ఆ కారణంగానే రేవంత్ రెడ్డికి కోపం వచ్చి అసలు సంధ్య థియేటర్లో ఏం జరిగింది ..? అన్న విషయం మినిట్ టూ మినిట్ వీడియా రిలీజ్ చేశారు . దీనితో పూర్తిగా సీన్ రివర్స్ అయిపోయింది . అల్లు అర్జున్ తప్పు చేశాడు అంటూ క్లారిటీకి వచ్చేసింది. అయితే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో అల్లు అర్జున్ కి సంబంధించిన కొన్ని వార్తలు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. పుష్ప2 సినిమాలో ఏ విధంగా పుష్పరాజ్ తన పలుకుబడితో తన హవాతో తన డబ్బుతో సీఎంనే మార్చేశాడో.. సేమ్ టు సేమ్ అదే సీన్ రిపీట్ కాబోతుంది అంటూ తెలంగాణ స్టేట్ లో టాక్ వినిపిస్తుంది . స్వయాన ఒక లాయర్ ఈ విషయాన్ని బయట పెట్టడం సంచలనంగా మారింది.
బన్నీ విచారణ తర్వాత అడ్వకేట్ పాదూరి శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేసిన విషయం అందరికీ తెలిసిందే . "అల్లు అర్జున్ ని కొంతమంది రాజకీయ పావుగా ఉపయోగించుకుంటున్నారు అని ..పుష్ప సినిమాలో జరిగినట్టే రేవంత్ రెడ్డి సర్కార్ ని కూల్ చేసే ప్రయత్నం జరుగుతుంది అని.. బిగ్ బాంబు పేల్చారు. అల్లు అర్జున్ వెనుక ఓ అదృశ్య శక్తి ఉంది అని .. కచ్చితంగా రేపటి నుంచి మరొక వారం రోజుల్లో రేవంత్ సర్కార్ పడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు".
దీనితో సోషల్ మీడియాలో ఇప్పుడు పుష్ప2 సినిమాలోని కొన్ని డైలాగ్స్ ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. సినిమాలో సీఎం ఫోటో ఇవ్వకపోతేనే పుష్ప రాజ్ కి కోపం వచ్చింది .. మరి రియల్ లైఫ్ లో ఆయనను ఈ విధంగా బాధపెడుతున్నారు బన్నీకి ఇంకా ఎంత కోపం వస్తుంది .. అదే స్ట్రాటజీ ఇక్కడ అప్లై చేశారు. సీఎంనే మార్చేయబోతున్నాడు బన్నీ అంటూ బన్నీ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయన టాలెంట్‌ను ఆయన పలుకుబడిని పొగిడేస్తున్నారు..!