ఈ మధ్య కాలంలో తెలుగు సునీల్ పరిశ్రమలో అనేక సినిమాలు రీ రిలీజ్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అలా రీ రిలీస్ అవుతున్న సినిమాలలో కొన్ని సినిమాలకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. దానితో చాలా మంది మేకర్స్ పాత సినిమాలను , బ్లాక్ బస్టర్ సినిమాలను , థియేటర్లలో విడుదల అయ్యి పెద్దగా ప్రేక్షక ఆదరణ పొందని సినిమాలను కూడా ఈ మధ్య కాలంలో రీ రిలీస్ చేస్తూ వస్తున్నారు. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి కొన్ని సంవత్సరాల క్రితం ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో హిట్లర్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో చిరంజీవి కి జోడిగా రంభ నటించగా ... రాజ్ , కోటి ఈ మూవీ కి సంగీతం అందించాడు. 1997 వ సంవత్సరం జనవరి 4 వ తేదీన ఈ మూవీ భారీ అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయింది.

భారీ అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చింది. ఈ సినిమా ఆ తర్వాత భారీ కలెక్షన్లను వసూలు చేసి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇలా అద్భుతమైన విజయాన్ని ఆ సమయంలో సొంతం చేసుకున్న ఈ సినిమాని తిరిగి మళ్ళీ థియేటర్లలో రీ రిలీస్ చేయనున్నారు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 1 వ తేదీన రీ రిలీజ్ చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఆ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇక చిరంజీవి హీరోగా రూపొందిన ఇంద్ర మూవీ కొంత కాలం క్రితం రీ రిలీజ్ అయ్యి కొత్త కొత్త రికార్డులను సృష్టించింది. మరి హిట్లర్ సినిమా ఏ స్థాయి ఇంపాక్ట్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర చూపిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: