రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్టాత్మకమైన చిత్రాలలో rrr  కూడా ఒకటి.. సినిమా క్రియేట్ చేసినటువంటి కలెక్షన్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్స్ లో మూడవ స్థానంలో నిలవడం గమనార్హం. ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ తమ నటనతో మెప్పించారు.. ఈ చిత్రానికి ఏంతో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డును కూడా అందుకోవడం గమనార్హం. rrr చిత్రం ఎలా మొదలయ్యింది.. ఎలా సాగింది? ఆస్కార్ అవార్డు వరకు ఎలా వెళ్ళిందనే విషయాలను సైతం ఇటీవల రాజమౌళి rrr బిహైండ్ అండ్ బియాండ్ అనే డాక్యుమెంటరీ రూపొందించడం జరిగింది.


ఇక దీనికి భారీ స్పందన వస్తుందనీ అందరూ అనుకున్నారు.. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరు కూడా చాలానే కష్టపడడం జరిగింది. ఈ విషయాన్ని డైరెక్టర్ రాజమౌళితో పాటు చిత్ర బృందం కూడా మాట్లాడారు. ఇందులోని కొన్ని సన్నివేశాలకు సంబంధించి అండర్ లొకేషన్ వర్క్, మేకింగ్ వీడియోలను సైతం డాక్యుమెంటరీలో చాలా క్లియర్ గా చూపించారట. ఇటీవలే థియేట్రికల్ ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయగా.. ఈ డాక్యుమెంట్ కోసం అభిమానులు ఎగ్జాయిటింగ్ గా ఎదురు చూశారు.


అయితే అభిమానులకు షాకిస్తూ ఈ డాక్యుమెంటరీ థియేటర్లో రిలీజ్ చేయబోతున్నామంటూ ప్రకటించారు చిత్ర బృందం. దీంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. అయితే దీనిని తక్కువ సంఖ్యలో థియేటర్లో రిలీజ్ చేయబోతున్నామని ప్రకటించారు. ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ డాక్యుమెంటరీ థియేటర్లో పెద్దగా ఆదరణ లభించలేదట.. థియేటర్లో పెద్ద సినిమాలు లేకున్నా కూడా ఎవరు చూడకపోవడంతో అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సోషల్ మీడియాలో భారీ ప్రచారం జరిగిన థియేటర్ వద్ద సందడి లేకపోవడంతో అభిమానులకు షాక్ అయింది. ప్రస్తుతం సంధ్య థియేటర్ ఇష్యూ వల్ల ఈ డాక్యుమెంటరీకి ఆదరణ దక్కలేదని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. నెట్ ఫ్లిక్స్ లో ఈనెల 27న ఈ డాక్యుమెంటరీ స్ట్రిమింగ్కి సిద్ధంగా ఉంది.. మరి ఓటీటీలో ఆయన ఏవిధంగా మెప్పిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: