ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా పుష్ప పార్ట్ 2 అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని డిసెంబర్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయగా డిసెంబర్ 4 వ తేదీన రాత్రి నుండి ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లను ప్రదర్శించడం మొదలు పెట్టారు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన డిసెంబర్ 4 వ తేదీ ప్రీమియర్ షో ను హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్న సంధ్య థియేటర్లో కూడా ప్రదర్శించారు. ఇక ఈ థియేటర్లో ప్రీమియర్ షో ను చూసేందుకు అల్లు అర్జున్ కూడా అక్కడికి విచ్చేశాడు.

ఇక అల్లు అర్జున్ అక్కడికి రావడంతో జనాలు భారీగా గుమి గుడారు. అలా భారీగా జనాలు గుమి గుడడంతో తొక్కిసులాట జరిగింది. ఆ తొక్కి సలాటలో రేపటి అనే మహిళ మృతి చెందింది. అలాగే ఆమె కుమారుడు కూడా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక అల్లు అర్జున్ కారణం గానే ఇంత పెద్ద ప్రమాదం జరిగింది అని తెలంగాణ ప్రభుత్వం ఆయన పై సీరియస్ గా ఉంది. ఇకపోతే తాజాగా సంధ్య థియేటర్ ఘటనపై సినీ నిర్మాత అయినటువంటి దిల్ రాజు స్పందించాడు. దిల్ రాజు తాజాగా ఈ ఘటనపై స్పందిస్తూ ... నేను తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసాను.

ఆయన కూడా సినిమా ఇండస్ట్రీ కి ఏమి కావాలి అంటే అది చేస్తాను అని చెప్పాడు. ఇక అల్లు అర్జున్ ని కూడా మరికొన్ని రోజుల్లోనే కలవబోతున్నాను. ఆయన వర్షన్ ఏమిటో కూడా వినబోతున్నారు. నేను ఇటు బన్నీకి అటు రేవంత్ రెడ్డికి మధ్య వారిదల పని చేస్తాను. అలాగే సినిమా ఇండస్ట్రీకి ఏది మంచో అది చేస్తాను. అలాగే చనిపోయిన రేవతి కుటుంబానికి ఎలా న్యాయం చేయాలో దానిపై కూడా ప్రణాళికలను వేస్తాను అని ఆయన తాజాగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: