మోస్ట్ బ్యూటి ఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీ మణి కీర్తి సురేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . ఈమె తమిళ సినిమాల ద్వారా సినిమా ప్రయాణాన్ని మొ దలు పెట్టింది . ఇక తమిళ్లో మంచి గుర్తింపును సంపాదించు కున్న తర్వాత ఈ బ్యూటీ తెలుగు సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసింది . అందు లో భాగంగా నేను శైలజ అనే మూవీ తో తెలుగు సినీ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమా తోనే మంచి విజయాన్ని అందుకుంది . ఆ తర్వాత కూడా ఈమెకు వరుస పెట్టి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి అవకాశాలు వచ్చాయి.

అందులో భాగంగా ఈమె నటించిన చాలా తెలుగు మూవీ లు మంచి విజయాలను సాధించడంతో ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి స్థాయికి చేరుకుంది. ఇప్పటివరకు తమిళ్ , తెలుగు ఇండస్ట్రీలలో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ బ్యూటీ మరికొన్ని రోజుల్లో హిందీ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా ఈ బ్యూటీ వరుణ్ ధావన్ హీరో గా రూపొందిన బేబీ జాన్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ఈ రోజు అనగా డిసెంబర్ 25 వ తేదీన విడుదల కానుంది. దానితో ఈమె మరియు వరుణ్ ధావన్ ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు.

తాజాగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా వరుణ్ ధావన్ మాట్లాడుతూ ... ముంబై లో కీర్తి కి అద్భుతమైన క్రేజ్ ఉంది. ముంబై లో షూటింగ్ చేస్తున్న సమయంలో ఎంతో మంది నన్ను తన నెంబర్ను అడిగారు. తనను జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యత. అందుకే ఎవరికీ తన ఫోన్ నెంబర్ ఇవ్వలేదు అని వరుణ్ దావత్ తాజాగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: