- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .


అల్లు అర్జున్ కెరీర్ కు మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా ఆర్య. దిల్ రాజు బ్యానర్లో దర్శకుడు సుకుమార్ తొలి సినిమాతో నే ఘనవిజయం అందుకున్నారు. వన్ సైడ్ లవ్ అంటూ సరికొత్త కాన్సెప్ట్ తో తెర‌కెక్కిన ఆర్య బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా తర్వాత సుకుమార్ రామ్ తో జగడం తీశారు. ఈ సినిమాను సుకుమార్ ముందుగా మహేష్ బాబు ... ఆ తర్వాత అల్లు అర్జున్ తో తీయాలని అనుకున్నారట. అయితే దిల్ రాజుతో జరిగిన చిన్న గొడవ కారణంగా రామ్ తో తీయాల్సి వచ్చింది అట. ఆర్య హిట్ అయిన వెంటనే సుకుమార్ బన్నీతో జగడం సినిమా చేయాలనుకుని కథ‌తో సహా అన్ని రెడీ చేసుకున్నారట. అదే సమయం లో చిన్న సమస్య వచ్చింది .. బాగా ఎమోషనల్ అయ్యి వెంటనే రాత్రికి రాత్రే హీరో రామ్ దగ్గరికి వెళ్ళిపోయి కథ చెప్పటం రామ్‌ ఓకే చేయటం అయిపోయిందట.


మరుసటిరోజే ముహూర్తం కూడా పెట్టించి ముహూర్త సన్నివేశానికి బన్నీని దిల్ రాజుని పిలిచాడట. సుకుమార్ దిల్ రాజు కథలో మార్పులు చేర్పులు చేయమని చెప్పిన వినకుండా సుకుమార్ జగడం సినిమాని తెరకెక్కించారు. జగడం డిజాస్టర్ అయింది. ఆ వెంటనే సుకుమార్ కాస్త తేరుకున్నారు. బన్నీ తో ఆర్య 2 సినిమా తీశారు ఇక అదే బన్నీతో పుష్ప 1 - పుష్ప 2 సినిమాలు తీసి పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ డూపర్ హిట్లు కొట్టారు. ఏది ఏమైనా బన్నీ జగడం సినిమా చేసి ఉంటే పెద్ద డిజాస్టర్ బన్నీ ఖాతా లో పడేది. అలా బ‌న్నీ ఈ డిజాస్ట‌ర్ నుంచి తెలివి గా ఎస్కేప్ అయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: