ప్రముఖ గీత రచయిత సుద్దాల అశోక్ తేజ అంటే విప్లవ సినిమాలకు మాత్రమే పాటలు రాసే రచయిత అన్న పేరు ఉండేది. తన కెరీర్ ప్రారంభంలో అశోక్ తేజ ఎక్కువగా విప్లవ సినిమాలకే పాటలు రాసేవారు. అయితే ఆయనలో ప్రతిభ గుర్తించిన మోహన్ బాబు ఫోన్ చేసి అన్ని విప్లవ సినిమాల కు పాటలు రాస్సతే ఎలా ? అలా అయితే ఏడాదికి ఒక సినిమాకు మాత్రమే పాటలు రాస్తావు .. కమర్షియల్ సినిమాల కు కూడా పాటలు రాయమని చెప్పారట.
అలా మోహన్ బాబు సలహా తో సుద్దాల అశోక్ తేజ కమర్షియల్ సాంగ్స్ రాసే రైటర్ గా ఎంట్రీ ఇచ్చి మోహన్ బాబు చాలా సినిమాల కు వరుస పెట్టి పాటలు రాస్తూ వచ్చారట. మోహన్ బాబు ఇద్దరు కుమారు లు కూడా సినిమాల్లో కి వచ్చే వరకు క్రమం తప్పకుండా మోహన్ బాబు ప్రతి సినిమా కు పాటలు రాస్తూ వచ్చారట. ఓ సారి మోహన్ బాబు సినిమాకు సుద్దాల అశోక్ తేజ పాటలు రాస్తోన్న క్రమం లో ఓ రోజు బైక్ మీద వెళుతూ కింద పడిపోయారట.
అప్పటికే ఆయనకు డయాబెటిస్ ఉండడంతో డాక్టర్లు పది రోజుల పాటు కాలు కదపవద్దని చెప్పారట. ఆ విషయాన్ని ఆయన మోహన్‌బాబుకు ఫోన్ చేసి చెప్పారట. వెంటనే ఆయన తన మేనేజర్‌ను పిలిచి సుద్దాల అశోక్ తేజకు రు. 25 వేలు ఇచ్చి రమ్మని పంపారట. వెంటనే మేనేజర్ సార్ ఇంకా ఆయన సాంగ్ ఓకే అనలేదని చెప్పగా.. వెంటనే మోహన్‌బాబు ఆయన మన ప్రతి సినిమాకు పాటలు రాస్తున్నారు. ఈ సినిమాకు కాకపోతే మళ్లీ సినిమాలకు రాస్తారులే అని చెప్పారట. అలా మోహన్ బాబు మంచి తనాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.