- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .


పుష్ప 2 సినిమా కోసం అల్లు అర్జున్ తీసుకున్న రెమ్యూనరేషన్ మూడు వందల కోట్ల రూపాయలు అట‌. ఈ విషయాన్ని కొద్ది రోజుల క్రితం ప్ర‌ముఖ మ్యాగ‌జైన్ సంస్థ‌ ఫోర్బ్స్ వెల్లడించింది. దేశంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోగా కూడా బ‌న్నీ రికార్డుల‌కు ఎక్కాడ‌ని అందులో ప్రకటించారు. ఇదిలా ఉంటే ఈ సినిమా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ బ్యాన‌ర్‌ డిసెంబర్ 20 న తన సోషల్ మీడియా పేజీ లో ఇప్పటి వరకు పుష్ప 2 సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1508 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్లు ప్రకటించ‌గా.. ఇది ఇప్పుడు రు. 1700 కోట్లు దాటేసింద‌ని కూడా ప్ర‌క‌టించు కున్నారు.


ఒక్క హిందీ లోనే ఏకంగా రు. 700 కోట్ల నెట్ దాటేసింద‌ని చెపుతున్నారు. ఇక ఒక్క సినిమా కు మూడు వందల కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్న నటుడు ఒక మనిషి ప్రాణానికి కట్టిన విలువ కేవ‌లం రు . 25 లక్షల రూపాయలు అంటే ఎవ్వ‌రికి అయినా బాధ క‌ల‌గ‌క మాన‌దు . ఆమె కుటుంబానికి తాను ఈ మేరకు సాయం చేస్తానని అల్లు అర్జున్ ఒక వీడియో ద్వారా చెప్పారు. క‌నీసం ఆమె కుటుంబాన్ని ప‌రామ‌ర్శించ కుండా .. ఆసుప‌త్రి లో చికిత్స పొందుతోన్న ఆ బాధిత బాలుడిని పరామ‌ర్శించ కుండా దానికి లీగ‌ల్ స‌మ‌స్య సాకుగా చూపి రు. 25 ల‌క్ష‌లు ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు.


ఎప్పుడు అయితే తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు వ‌చ్చాయో .. సాక్షాత్తు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ లో మాట్లాడారో ?  అప్పుడు ఫిక్స్ డ్ ఫండ్ పేరిట కొత్త మాట చెప్పాడు బ‌న్నీ. ఇదంతా అరెస్ట్ అయిన తర్వాత చెప్పిన మాట .. అదే అరెస్టుకు ముందు మాత్రం 25 లక్షల సాయం ప్రకటించి వదిలేశారు. ఇదే విష‌యాన్ని బ‌న్నీ ముందు చెప్పి ఉంటే బాగుండేది. ఇక సోమ‌వారం మైత్రీ వాల్లు రేవతి కుటుంబ సభ్యలకు 50 లక్షల రూపాయల చెక్ అందచేసింది. వంద‌ల కోట్లు సంపాదించిన వారు.. ఇలా చేయ‌డం క‌రెక్టేనా ? అన్న ప్ర‌శ్న‌లు కూడా వ‌స్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: