రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు... ఒకే ఒక్క టాపిక్ అల్లు అర్జున్ అరెస్ట్. ఈ అంశం గురించి అందరూ చర్చించుకుంటున్నారు. అయితే అల్లు అర్జున్ పై కక్ష ధోరణితో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని.. సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆయన పేరు మర్చిపోయినందుకు అల్లు అర్జున్ పైన రివెంజ్ తీర్చుకుంటున్నారు అని కొంతమంది చెబుతున్నారు. అయితే.. ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా అల్లు అర్జున్ కూడా మాట్లాడకుండా ఉంటే బాగుండేదని వారు కూడా ఉన్నారు.

 గతంలో పవన్ కళ్యాణ్ పైన జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు లాగానే ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యవహారం నడుస్తోందని చెబుతున్నారు. కాబట్టి ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసేటప్పుడు... కాస్త ఓపికగా ఉంటే.. బెటర్ అని చెబుతున్నారు సీనియర్ జర్నలిస్టులు, రాజకీయ విశ్లేషకులు. కానీ రేవతి ఇష్యులో... అల్లు అర్జున్ అలా వ్యవహరించలేదని అంటున్నారు. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత... ప్రెస్ మీట్ పెట్టి అల్లు అర్జున్ తప్పు చేశాడని చెబుతున్నారు.

 ఆ ప్రెస్ మీట్ లో కూడా... కాస్త గర్వంగా, ఆటిట్యూడ్  తో అల్లు అర్జున్ వ్యవహరించినట్లు  సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కొంతమంది సీనియర్ రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే అంశాన్ని చెబుతున్నారు.  ఆ యాటిట్యూడ్ లేకుండా... కాస్త సైలెంట్ గా ఒక్కరోజు అల్లు అర్జున్ ఉంటే... ఇంత పెద్ద రచ్చ కాకపోయేదని చెబుతున్నారు. ఇప్పటికైనా అల్లు అర్జున్ రియలైజ్ అయి... సోషల్ మీడియా వేదికగా రేవంత్ రెడ్డికి క్షమాపణలు చెబితే బెటర్ అని అంటున్నారు.

 లేకపోతే తెలంగాణ ప్రభుత్వం... మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. కాబట్టి ఏ హీరో అయినా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వ్యవహరించకుండా సైలెంట్ గా తమ పని తాము చేసుకోవాలని సూచిస్తున్నారు. అయితే ఇక పైన అల్లు అర్జున్ ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్తారో మనం చూడాల్సి ఉంటుంది. ఒకవేళ అల్లు అర్జున్ తగ్గకపోతే.. మళ్లీ అతన్ని అరెస్టు చేసే ఛాన్స్ కూడా లేకపోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: