అల్లు అర్జున్ అరెస్ట్ తీరుని చూస్తుంటే చాలామంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అల్లు అర్జున్ పై పగ పట్టిందని,కావాలనే ఆయనను అరెస్ట్ చేసి ఆ కేసులో ఇరికిస్తున్నారని ప్రధాన నిందితుడిగా చేస్తున్నారని ఎంతోమంది నోరు విప్పి మాట్లాడుతున్నారు.అయితే చాలామంది సెలబ్రిటీలు కూడా అల్లు అర్జున్ కి సపోర్ట్ ఇస్తూ తెలంగాణ లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల గురుకులాల్లో లేదా ఇంకా వేరే ఏదైనా కారణాలవల్ల విద్యార్థులు వంటి వాళ్ళు చనిపోతున్నారు. మరి అంత మంది చనిపోయినప్పుడు ఆ భారం ప్రభుత్వానితే కదా. మరి ప్రభుత్వాన్ని ఎన్ని సార్లు జైల్లో పెట్టాలి అంటూ స్పందిస్తున్నారు. అయితే అల్లు అర్జున్ పై రేవంత్ రెడ్డి ప్రభుత్వం పగ పెంచుకోవడానికి కారణం అదేనేమో అంటున్నారు కొంతమంది సినీ జర్నలిస్టులు. మరి ఆ పగ ఏంటయ్యా అంటే..

 గతంలో బ్లాక్లో టికెట్లు అమ్ముకోవడానికి వీలుండేది కాదు. కానీ ఇప్పుడు ప్రభుత్వాలే బ్లాక్ లో టికెట్లు అమ్ముకోవడానికి వసతి కల్పిస్తున్నారు.ఎలా అంటే బెనిఫిట్ షోలు.. బెనిఫిట్ షోలు చూడడానికి వచ్చే చాలామంది జనాలు వేలకు వేలు పెట్టి టికెట్లు కొంటూ ఉంటారు.ఒక రకంగా ఇది సినిమా తీసిన వాళ్ళకి పెద్ద లాభమే అవుతుంది.అయితే అల్లు అర్జున్ కి సంబంధించిన పగ సినిమాలకు సంబంధించి అని తెలుస్తుంది. చాలామంది సెలబ్రిటీలు ఆధిపత్యం కోసం పోరాడుతుంటారు. అయితే ప్రభుత్వం వాళ్లు బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చినప్పుడు మీరు కోట్లు సంపాదిస్తున్నారు మాకు కూడా ఎంతో కొంత ఇవ్వాలి కదా అని ఎవరో ఒకరిద్దరు నేతలు సినిమా నిర్మాతల మీద ఒత్తిడి తెచ్చి ఒక షో మాకు ఇచ్చేయండి. ప్రతి నియోజకవర్గ పరిధిలో ఒక షో మాకు ఇచ్చేయండి.

నీలాగే వాళ్లు కూడా కొంత సంపాదించుకుంటారు అని అడిగారు. కానీ దానికి సినీ నిర్మాతలు అంగీకరించకలేదు.ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకి ప్రతి నియోజకవర్గంలో ఒక థియేటర్ ఇస్తూ పోతే ఇది గమనించిన ప్రతిపక్షం వాళ్లు కూడా మాకు కూడా ఇవ్వండి అని అంటారు. ఒకవేళ వాళ్లకు సినీ నిర్మాతలు థియేటర్ ఇస్తే ఈ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు నెక్స్ట్ అధికారంలోకి వచ్చాక మనసులో పెట్టుకొని మళ్ళీ ఇండస్ట్రీ వారిని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఒక షో అంటే హైదరాబాదు లాంటి పెద్ద పెద్ద పట్టణాలలో బెనిఫిట్ షో కి 50 లక్షలు వస్తాయి. మామూలు చిన్న చిన్న పట్టణాల్లో అయితే 25 లక్షల వరకు వస్తాయి.

 కానీ వాటిలో జిఎస్టి కూడా పోతాయి. దీనివల్ల నిర్మాతలకి నష్టం వస్తుంది. ఇక నిర్మాతలు 50, 100 కోట్లు బెనిఫిట్ షోలతో సంపాదించుకుంటే ఇప్పుడున్న నేతలకు ఒక షో అప్పగిస్తే 30% నిర్మాతలకి లాస్ వస్తుంది. ఇప్పుడు వీళ్లకు ఒప్పుకుంటే మళ్ళీ ప్రతిపక్షం వాళ్లు కూడా అడుగుతారు. అలా ప్రతిపక్షం అధికారపక్షం ఇద్దరు నేతలకు ఇచ్చేస్తే సినిమా తీసిన నిర్మాతలకు ఏమి మిగలదు. అందుకే ఇలాంటి వ్యవహారంలో మమ్మల్ని దూర్చకండి అని చెప్పడం వల్లే అల్లు అర్జున్ ని ఈ కేసులో ఇరికించినట్టు ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకుంటున్నారు. కానీ పోలీసులు మాత్రం అలాంటిదేమీ లేదు చట్ట ప్రకారమే వెళ్తున్నాం అంటూ చెప్పుకొస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: