స్టార్ హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం కెరీర్ పరంగా విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ ఇక్కట్లను చూసి పవన్ అభిమానులు మాత్రం సంతోషిస్తున్నారని తెలుస్తోంది. తమ హీరో విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బన్నీ ఇప్పుడు అందుకు సంబంధించిన ఫలితాన్ని మరో విధంగా అనుభవిస్తున్నారని వాళ్లు ఫీలవుతున్నారని సమాచారం అందుతోంది.
 
పుష్ప ది రూల్ సినిమా రిలీజ్ కు ముందే ఈ సినిమాను ఫ్లాప్ చేస్తామని పవన్ అభిమానులు కామెంట్లు చేశారు. అయితే సినిమాకు యునానిమస్ పాజిటివ్ టాక్ రావడం, నార్త్ బెల్ట్ లో ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడంతో నెగిటివ్ టాక్ ను స్ప్రెడ్ చేసినా ఫలితం అయితే లేకుండా పోయింది. పుష్ప ది రూల్ హిందీలో హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది.
 
బాలీవుడ్ స్టార్ హీరోలకు సైతం సాధ్యం కాని రికార్డును బన్నీ సొంతం చేసుకోవడం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. బన్నీ నంద్యాలకు వెళ్లి వైసీపీ అభ్యర్థి తరపున ప్రచారం చేయడం వల్ల బన్నీ ఫ్యాన్స్, పవన్ ఫ్యాన్స్ మధ్య ఒకింత గ్యాప్ మొదలైంది. పలు సందర్భాల్లో బన్నీ చేసిన కామెంట్లు సైతం బన్నీ కెరీర్ పై తీవ్రస్థాయిలో ఎఫెక్ట్ చూపాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్.
 
చెప్పను బ్రదర్ అంటూ చేసిన కామెంట్లు బన్నీకి ఒక విధంగా కెరీర్ పరంగా శాపంగా మారాయని చెప్పవచ్చు. బన్నీకి ఇండస్ట్రీ వైపు నుంచి కూడా పూర్తిస్థాయిలో సపోర్ట్ లభించలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. మెగా ఫ్యామిలీ వల్లే ఎదిగిన అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీని దూరం చేసుకుంటే మాత్రం మరిన్ని ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు. పవన్ అపాయింట్మెంట్ కోసం బన్నీ ప్రయత్నించినా ఆ ప్రయత్నాలు సఫలం కాలేదని భోగట్టా. బన్నీని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య మాత్రం అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.




మరింత సమాచారం తెలుసుకోండి: