ఇలాంటి సమయంలో సహజంగానే.. ఏపీవైపు అందరూ చూస్తారని అనుకున్నారు. ఏపీలో అయితే.. కూట మి సర్కారు ఉండడం.. సినిమా రంగాన్ని ప్రోత్సహించేందుకు సర్కారు ప్రయత్నాలు చేయడం.. అంతా బాగానే జరుగుతున్నాయి. ఇటీవల పుష్ప-2కు తెలంగాణ ప్రభుత్వం రూ.800 పెంచుకునేందుకు అవకా శం ఇస్తే.. ఏపీలో ఏకంగా 1200 వరకు టికెట్ల ధరలు పెంచుకునేందుకు అవకాశం ఇచ్చారు. దీనిని గుట్టు చప్పుడు కాకుండా.. చేశారు.
ఇదంతా కూడా.. టాలీవుడ్‌ను ఆకర్షించేందుకే. కానీ, ఎందుకో.. ఇప్పుడు ఇంత జరుగుతున్నా.. టాలీవుడ్ ప్రముఖుల నోటి నుంచి ఏపీ మాటే వినిపించడం లేదు. ఏపీ గురించిన ప్రస్తావనే రావడం లేదు. దీనికి కారణాలేంటి? అనే విషయంపై రెండు రకాల చర్చలు జరుగుతున్నాయి. నిర్మాణ సంస్థలు అన్నీ రెండు వర్గాల చేతిలో ఉన్నాయి. ఈ రెండు వర్గాలకు.. కూటమి సర్కారుతో సఖ్యత లేదని తెలుస్తోంది. ఈ నిర్మాణ సంస్థలే పెద్దవి కావడంతో.. ఇవే రానప్పుడు.. చిన్న సంస్థలు వచ్చే అవకాశం తక్కువ.
రెండోది.. ఏపీ ఇంకా పుంజుకోకపోవడం.. రాజకీయంగా అస్థిరత్వంతోనే ఉందన్న భావన కూడా ప్రబలు తోంది. అదేసమయంలో ఓ పెద్ద హీరో కుటుంబంతో ఉన్న విభేదాలు కూడా టాలీవుడ్‌ను ఏపీవైపు చూడ కుండా చేస్తున్నాయన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై అంతర్గతంగా సర్కారు స్థాయిలో చర్చలు జరు గుతున్నాయి. కానీ, గతంలో మాదిరిగా ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలో సినీ రంగంపై స్పందించే మంత్రులు నేరుగా కనిపించడం లేదు. పైగా కులాల ప్రాతిపదికన చీలిపోయిన వ్యవహారం కూడా.. ఇబ్బందిగా ఉంది. ఈ నేపథ్యంలోనే పుష్ప-2పై ఇంత రచ్చ జరుగుతున్నా.. టాలీవుడ్ మాత్రం ఏపీ వైపు చూడడం లేదని అంటున్నారు. మరి మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.