సోనాక్షి, జహీర్.. సీక్రెట్ వెడ్డింగ్..
బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా, నటుడు జహీర్ ఇక్బాల్ జూన్ 23న ముంబైలోని తమ నివాసంలో అత్యంత సన్నిహితుల మధ్య వివాహం చేసుకున్నారు. చాలాకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట, ఎట్టకేలకు తమ బంధాన్ని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లారు. ఆ తర్వాత ఒక గ్రాండ్ పార్టీ కూడా ఇచ్చారు.
శోభిత, నాగచైతన్య.. సింపుల్ అండ్ స్వీట్
టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో నాగచైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో సంప్రదాయ తెలుగు పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ఈ వేడుక చాలా నిరాడంబరంగా, కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది.
అదితి రావు హైదరి, సిద్ధార్థ్.. మ్యాజికల్ వెడ్డింగ్!
నటి అదితి రావు హైదరి, నటుడు సిద్ధార్థ్ సెప్టెంబర్‌లో వివాహం చేసుకున్నారు. తమ బంధం మ్యాజికల్, శాశ్వతమైనదని చెబుతూ, పెళ్లి ఫోటోలను ఆన్‌లైన్‌లో షేర్ చేసింది అదితి. ఈ జంట పెళ్లి చాలా ప్రైవేట్‌గా జరిగింది.
కీర్తి సురేష్, ఆంటోనీ తట్టిల్
హీరోయిన్ కీర్తి సురేష్ డిసెంబర్‌లో గోవాలో ఆంటోనీ తట్టిల్‌ను వివాహం చేసుకున్నారు. సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ వేడుక ఫోటోలను కీర్తి సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తాప్సీ పన్ను, మథియాస్ బోయ్
బాలీవుడ్ నటి తాప్సీ పన్ను, బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోయ్ మార్చి 23న ఉదయ్‌పూర్‌లో అందమైన వేడుకలో ఒక్కటయ్యారు. ఈ వేడుకకు కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.
ఆలియా కశ్యప్, షేన్ గ్రెగోయిర్
ఆలియా కశ్యప్ డిసెంబర్ 11న షేన్ గ్రెగోయిర్‌ను వివాహం చేసుకున్నారు. వీరి రిసెప్షన్‌కు బాలీవుడ్ తారలు, కుటుంబ స్నేహితులు హాజరై సందడి చేశారు. ఈ విధంగా 2024 సంవత్సరం ఎన్నో సెలబ్రిటీల పెళ్లిళ్లతో కలర్‌ఫుల్‌గా ముగిసింది.
అంబానీ ఇంట పెళ్లి సందడి..
దేశంలోనే అత్యంత సంపన్న కుటుంబాలలో ఒకటైన అంబానీ ఇంట పెళ్లి వేడుక ఎంత గ్రాండ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ జులై 12న ముంబైలో సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు. ఆ మరుసటి రోజు జరిగిన 'శుభ ఆశీర్వాద్' వేడుకకు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారంటే ఈ వేడుక ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇక జులై 14న జరిగిన రిసెప్షన్‌కు బాలీవుడ్ తారలతో పాటు హాలీవుడ్ సెలబ్రిటీలు జాన్ సీనా, కిమ్ కర్దాషియన్ కూడా హాజరై సందడి చేశారు.