మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో ఇప్పటివరకూ ఆయనకు తిరుగులేదు. చిత్రపరిశ్రమలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎవరికి ఏ ఆపద వచ్చిన చిరంజీవి ముందు నిలుస్తారు. ఇప్పటివరకు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారెవరూ లేరు.ఇదిలావుండగా అల్లు అర్జున్ పుష్ప 2 ప్రీమియర్ సమయంలో సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ వర్సెస్ తెలంగాణ ప్రభుత్వంలా మారిపోయింది. ఈ నేపథ్యంలో చిరంజీవి కొన్నాళ్ల కిందట చేసిన కామెంట్స్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు మరోసారి వైరల్ అవుతోంది. సినిమా ఇండస్ట్రీ గురించి పెద్దల సభలో మాట్లాడుతున్నారు.వీళ్లకు పనీపాటా లేదా అనిపిస్తోంది.ఇండస్ట్రీపై బ్రహ్మాస్త్రం ఎందుకు అంటూ చిరు అందులో చేసిన కామెంట్స్ ఇప్పటి పరిస్థితులకు అతికినట్లుగా సరిపోతోందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.చిరంజీవి గతేడాది సంక్రాంతికి వాల్తేర్ వీరయ్యతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలుసు కదా. ఆ మూవీ 200 రోజుల వేడుకలో మెగాస్టార్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అప్పటి ఏపీ, కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఈ కామెంట్స్ చేసినట్లుగా ఆ వీడియో చూస్తే స్పష్టమవుతోంది.అందులో సినిమా ఇండస్ట్రీని ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారని చిరంజీవి అనడం గమనార్హం. ఇప్పుడు తెలంగాణలో సినిమా ఇండస్ట్రీ వర్సెస్ ప్రభుత్వం అన్నట్లుగా పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆ కామెంట్స్ దీనికోసమే చేశారా అన్నట్లుగా అనిపిస్తున్నాయి. 

ఇంతకీ ఆ వీడియోలో చిరు ఏమన్నాడంటే పెద్దల సభలో కూడా మాట్లాడుకుంటున్నారంటే ఏం పనీపాటా లేదా అనిపిస్తోంది. సినిమాల మీద సినిమాలు చేస్తున్నామంటే మాకు డబ్బులొస్తాయని కాదు సార్ మా వాళ్లందరికీ ఉపాధి లభిస్తుంది.వాళ్లంతా హాయిగా ఉంటారని. ఏదో పెద్ద సమస్యలాగా, ఇంతకంటే పెద్ద సమస్య లేదన్నట్లుగా మీరు పార్లమెంటులోనూ మాట్లాడుతున్నారంటే చాలా దురదృష్టం ఇది.ప్లీజ్ సినిమాను దూరంగా ఉంచండి. మీకు వీలైతే సాయం చేయండి. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఉందంటే దానికి కారణం మేం ఖర్చు పెడుతున్నాం కాబట్టి. ఇలాంటి ఖర్చుకు ఎంతోకొంత రెవెన్యూ రావాలని కోరుకోవడం కూడా సమంజసమే. వీలైతే ప్రభుత్వాలు సహకరించండి. అంతేకానీ అణగదొక్కడానికో దీన్నేదో తప్పని దేశవ్యాప్తంగా ఎత్తి చూపుతూ రాజ్యసభల్లోనూ చర్చించకండి. పొలిటీషియన్స్ పెద్దోళ్లు. సినిమా చిన్నది. నేను అదీ చూశాను.. ఇదీ చూశాను. మీరు పెద్ద పెద్ద విషయాలపై చర్చించండి. అంతేకానీ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా సినిమా ఇండస్ట్రీపై ఏంటి సర్ అని చిరంజీవి ఆ వీడియోలో అన్నారు.చిరు ఆ పరిస్థితులకు తగినట్లు అప్పుడు మాట్లాడాడు. కానీ ఇప్పుడున్న పరిస్థితులకు కూడా అతని కామెంట్స్ సరిగ్గా సరిపోతాయంటూ ఈ వీడియోను సోషల్ మీడియాలో పలువురు షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ వివాదం ఎంత వరకూ వెళ్తుంది? తెలంగాణ నుంచి సినిమా ఇండస్ట్రీ తరలిపోతుందా అన్న చర్చ మధ్య చిరంజీవి పాత వీడియో దీనికి ఒకరకంగా సమాధానం ఇచ్చినట్లే అవుతుందని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: