భర్త అయినా సరే ప్రాబ్లమ్స్ లో ఉన్న.. చికాకులు ఎదుర్కొంటున్న.. చిక్కుల్లో ఇరుక్కున్న .. ఆ భార్యకి అస్సలు మనశ్శాంతి ఉండదు . ఆ మాటకొస్తే కుటుంబం మొత్తం కూడా టెన్షన్ టెన్షన్ గానే ఉంటుంది . ప్రెసెంట్ అలాంటి సిచువేషన్ ఫేస్ చేస్తుంది అల్లు అర్జున్ ఫ్యామిలీ. అసలు అల్లు అర్జున్ ఫ్యామిలీకి ఏ దిష్టి తగిలిందో తెలియదు కానీ ఎప్పుడు సంతోషంగా ఆహ్లాదకరంగా నవ్వుకుంటూ ఉండే ఫ్యామిలీ ఇప్పుడు చిక్కుల్లో ఇరుక్కుపోయింది . అసలు మనశ్శాంతి లేదు అటు అల్లు అర్జున్ జైలుకు వెళ్లే పరిస్థితి వచ్చేస్తుంది. మరొక పక్క స్నేహ రెడ్డి ఫుల్ డిసప్పాయింట్ అయిపోయింది . అల్లు అర్హ - అల్లు అయాన్ పేర్లు ఇండస్ట్రీలో ఓ రేంజ్ ట్రోల్లింగ్ కి గురవుతున్నాయి . ఇక అల్లు అరవింద్ గురించి అయితే అస్సలు చెప్పనవసరం లేదు .


చెట్టు అంత  కొడుకు ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఆ పేరు మొత్తం గంగలో కలిసిపోబోతుంది అని బాధపడిపోతున్నాడు . మీడియా సమావేశంలో ఆయన మాట్లాడిన పద్ధతి చూస్తే ఆ విషయం ఎవరికైనా అర్థమైపోతుంది. అయితే పుష్ప2 సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి అల్లు  ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్లింగ్ కి గురవుతున్నాయి.  ఆఫ్ కోర్స్ పుష్ప సినిమా రిలీజ్ అయ్యే ముందు మెగా వర్సెస్ అల్లు వార్ పీక్స్ కి చేరుకుంది. ఆ తర్వాత సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయ్యింది. హిట్ అయిన కూడా ఆనందమే లేకుండా పోయింది. దీనితో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి శాంతి పరిహార పూజలు చేయాలి అంటూ డిసైడ్ అయ్యిందట .



తిరుపతి నుంచి ప్రత్యేకంగా పూజారిలను ఇంటికి పిలిపించుకొని మరి హోమాలు వేయాలి అని ప్రత్యేక పూజలు చేయాలి అని డిసైడ్ అయిపోయిందట . జనవరి 10వ తేదీ లోపే ఈ పనులన్నీ కూడా పూర్తి చేసే విధంగా దగ్గరగా ఉండే పండితులు  సలహా ఇచ్చారట. ఈ మేరకు అల్లు అర్జున్ జాతకంలో దోషం ఉంది.. ఇలా పూజలు చేయాలి అంటూ సజెషన్స్ ఇచ్చిన కారణంగానే స్నేహారెడ్డి ప్రత్యేక పండితులను పిలిపించుకొని మరి అల్లు అర్జున్ ఇంట్లోనే హోమాలు వేయించబోతుందట . అల్లు అర్జున్ మొదటినుంచి ఇలాంటివి నమ్మడు కానీ పరిస్థితులు చూస్తుంటే చేయి జారిపోతుంది అన్న ఉద్దేశంలో ఈ డెసీషన్ కు ఓకే చెప్పాడట.  ప్రజెంట్ ఇదే న్యూస్ బాగా వైరల్ గా మారింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: