-   ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . ..

రచయిత చిన్నికృష్ణ ఇంట విషాదం ..

చిన్ని కృష్ణ తల్లి కన్నుమూత ..

నేడు తెనాలిలో అంత్యక్రియలు ..

టాలీవుడ్ ప్రముఖ సిని రచయిత చిన్న కృష్ణ ఇంట‌ తీవ్ర విషాదం చోటు చేసుకుంది .. ఆయన తల్లి సుశీల బుధవారం అనగా ఈరోజు తెల్లవారుజామున మరణించారు .. గత కొంత కాలంగా అనారోగ్యం తో బాధపడుతున్న సుశీల ఆసుపత్రి లో వైద్యం పొందుతూ ఈరోజు తెల్లవారుజామున తృది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు చెప్పకు వచ్చారు .. చిన్నికృష్ణ స్వగ్రామం అయిన తెనాలిలో ఈరోజు అంత్యక్రియలు జరగనున్నాయి .. సుశీల మృతి కి టాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతూ ఆమె ఆత్మ కు శాంతి చేకూరాలని ప్రార్ధనలు చేస్తున్నారు . 
ఇంద్ర , నరసింహనాయుడు , గంగోత్రి వంటి సినిమాల కు కథలు అందించిన చిన్ని కృష్ణ కు తన తల్లి సుశీల తో ఎంతో మంచి అనుబంధం ఉంది ..


 ఇటీవల మదర్స్ డే సందర్భం గా ఆయన పెట్టిన పోస్ట్ అందుకు నిదర్శనం .. ఎన్ని జన్మలకైనా నీకే నేను కొడుకు గా జన్మించాలంటూ మదర్స్ డే స్పెషల్ గా ఆయన ఒక స్పెషల్ వీడియో ను షేర్ చేయక అది బాగా వైరల్ అయింది .. అదే విధంగా అమ్మ ప్రేమ గొప్పతనం గురించి ఆయన తెలుపుతూ రాసిన కవిత లు సైతం ఎంతో ప్రాచుర్యం తెచ్చుకున్నా .. ఈ విషయంతో సినీ ఇండస్ట్రీ మూగబోయింది. పలువురు సినీ సెలబ్రిటీలు రచయిత తల్లి మరణానికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా ద్వారా తమ సంతాపం తెలియజేస్తున్నారు.ఈ కష్ట సమయం లో రచయిత చిన్ని కృష్ణ కు ఆ దేవుడు   ధైర్యాన్ని ఇవ్వాలంటూ ఆయన సన్నిహితులు కోరుకుంటున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: