చివరిగా శంకర్ దగ్గర నుంచి వచ్చిన భారతీయుడు 2 సినిమా ప్రేక్షకులను ఎంతగానో నిరాశపరిచింది. అయితే చాలామంది స్టార్ నటులతో సినిమా చేయడానికి ప్రయత్నించిన శంకర్ తో సినిమా చేయడానికి వాళ్ళు నో చెప్పినట్టు ఆయనే స్వయంగా చెప్పాడు. రజనీకాంత్ , కమలహాసన్ , విజయ్ సాహ ఎందరో అగ్ర హీరోలతో సినిమాలు చేసిన శంకర్ .. టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని అనుకున్నారు .. అందుకోసం చాలాసార్లు ప్రయత్నించిన అది కుదరలేదు. అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నాడు. శంకర్ , రామ్ చరణ్ కాంబోలో వస్తున్న గేమ్ చేంజర్ వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
మెగాస్టార్ చిరంజీవితోనే కాకుండా మన టాలీవుడ్ నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబుతో కూడా ఓ సినిమా చేయాలని శంకర్ ప్రయత్నించాడు. కానీ అది కుదరలేదు. శంకర్ చెప్పిన కథ నచ్చినప్పటికీ పలు అనుకొని కారణాలవల్ల మహేష్ సినిమా సెట్ కాకుండా మధ్యలో ఆగిపోయింది. ఇవి మాత్రమే కాకుండా కోవిడ్ సమయంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో కూడా శంకర్ ఓ సినిమా చేయడానికి ప్రయత్నించాడు .. ప్రభాస్ కి కథ కూడా చెప్పినట్టు తెలుస్తుంది కానీ అనుకోని కారణాల వల్ల ఆ సినిమా సెట్ కాలేదు. ఇక ప్రజెంట్ రామ్ చరణ్ కోసం శంకర్ గేమ్ చేంజర్ సినిమాను తెరకెక్కించాడు .. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ కథ అంశంతో తెరకెక్కిన సినిమా.. రామ్ చరణ్ ఈ సినిమాలో ఐపీఎస్ అధికారి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. కీయర అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. మరి సంక్రాంతికి వస్తున్న ఈ సినిమాతో శంకర్ , రామ్ చరణ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తారో చూడాలి.