రజనీకాంత్‌కు అమ్మగా, లవర్‌గా, భార్యగా నటించిన ఏకైక తెలుగు స్టార్ హీరోయిన్ మన అందాల తార శ్రీదేవి. 1976లో వచ్చిన 'మూండ్రు ముదిచు' సినిమాలో రజనీకాంత్‌కు శ్రీదేవి తల్లిగా నటించింది. కాగా, ఈ సినిమా శ్రీదేవికి ఫస్ట్ మూవీ. ఇక ఆ తర్వాత వీళ్ల కాంబినేషన్‌లో 22 సినిమాలు వచ్చాయి. అందులో చాలా సినిమాల్లో లవర్‌గా, మరికొన్ని సినిమాల్లో భార్యగా నటించింది. అలా రజనీకాంత్‌తో అమ్మగా, భార్యగా, లవర్‌గా నటించిన మొదటి, చివరి హీరోయిన్ గా శ్రీదేవి నిలిచింది.
ఇక రజినీకాంత్ అంటే కేవలం తమిళంలో మాత్రమే కాదు.. తెలుగులోనూ తిరుగులేని పాపులారిటీ సంపాదించుకున్నాడు. 7 పదుల వయసులోనూ ఇండస్ట్రీ హిట్ రికార్డులు తిరగరాయడం ఒక్క రజనీకాంత్‌కే చెల్లింది. అంతేకాదు.. ఆయన ఇండియన్ ఇండస్ట్రీలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోల్లో టాప్ 5 ప్లేస్‌లలో ఉన్నాడు. ప్రస్తుతం రజనీకాంత్ ఒక్కో సినిమాకు అక్షరాల రూ.180 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న కూలీ సినిమా చేస్తున్నాడు. అక్కినేని నాగార్జున కీలక రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.