కొందరేమో రేవంత్ రెడ్డిని బన్నీ అవమానించాడు . ఆ కారణంగానే ఈ విధంగా చేస్తున్నాడు అంటుంటే.. మరి కొందరు మాత్రం అల్లు అర్జున్ ని ప్రచారంలో హెల్ప్ చేయమంటే చేయలేదు అని.. ఆ కారణంగానే ఈ విధంగా అల్లు అర్జున్ ఇబ్బందులకు గురి చేస్తున్నాడు అని మాట్లాడుకుంటున్నారు. అసలు నిజానిజాలు ఆ దేవుడికి ..బన్నీకి.. రేవంత్ రెడ్డికి తెలియాలి. అయితే ప్రజెంట్ రేవంత్ రెడ్డి పేరు తెలంగాణలో మారుమ్రొగిపోతుంది. " ఒకే ఒక్కడు " సినిమాలో అర్జున్ పేరుని ఏ విధంగా పొగిడేసారో అంతకు వంద రెట్లు స్థాయిలోనే రేవంత్ రెడ్డి పేరును పొగిడేస్తున్నారు . ఇలాంటి సీఎం ఇలాంటి సీఎంనే జనాలు కోరుకుంటున్నారు అంటూ నువ్వు నిజమైన సీఎం రియల్ సీఎం అంటూ ప్రశంసిస్తున్నారు.
అయితే ఇది కొంత మంది మాత్రమే..కొంతమంది వర్షెన్ మాత్రం వెరేఅలా ఉంది. నీ దూకుడు పనికిరాదు. నీకు త్వరలోనే పదవి దిగిపోయే కాలం దగ్గర పడింది అంటూ శాపనార్దలు కూడా పెడుతున్నారు. రీసెంట్గా అడ్వకేట్ పాదురి శ్రీనివాస్ రెడ్డి చేసిన కామెంట్స్ రాజకీయాలలో పెద్ద సంచలనంగా మారిపోయింది . పుష్ప సినిమాలో జరిగిన మాదిరే బన్నీ తెలంగాణ సీఎంను మార్చేయబోతున్నాడు అని.. త్వరలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మాజీ రేవంత్ రెడ్డిగా మారిపోతుంది అంటూ పరోక్షకంగా సంచలన కామెంట్స్ చేశారు . ఈ వారంలో బీఆర్ఎస్ - బీజేపీలు కూడా తమదైన స్టైల్ లో రాజకీయాలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఊహించని విధంగా చేయబోతుంది అని మాట్లాడుకుంటున్నారు. అయితే ఇదే ప్లస్ క భావించిన బన్నీ ఫాన్స్ చాలామంది సోషల్ మీడియా వేదికగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి మరీ ట్రోల్ చేస్తున్నారు . నిజంగానే బన్నీ ఆ విధంగా చేస్తే రేవంత్ రెడ్డి కాస్త రవ్వంత అయిపోడు అంటూ ..ఎమ్మెల్యేలు జస్ట్ పది మందిని మార్చేస్తే రేవంత్ సీఎం పదవి హుష్ కాకి అంటూ ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఈ కామెంట్స్ ఎక్కువగా వైరల్ గా మారాయి..!