తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరోలలో బాలయ్య , వెంకటేష్ కూడా ఉంటారు . వీరిద్దరూ అనేక సార్లు బాక్సా ఫీస్ దగ్గర తలపడ్డారు . అలాగే వీరి సినిమాలు సంక్రాంతి పండక్కి కూడా చాలా సార్లు తల పడ్డాయి . మరి వీరిద్దరూ సంక్రాంతి పండుగకు ఎన్ని సార్లు తలపడ్డారు. అందులో ఎప్పుడు ఎవరు గెలిచారు అనే వివరాలను తెలుసుకుందాం.

2000 సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా బాలకృష్ణ హీరోగా రూపొందిన వంశోద్ధారకుడు సినిమా విడుదల కాగా , ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా వెంకటేష్ హీరోగా రూపొందిన కలిసుందాం రా సినిమా విడుదల అయింది. ఇందులో కలిసుందాం రా సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకొని ఆ సంవత్సరం సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ఇక 2001 వ సంవత్సరం బాలయ్య హీరో గా రూపొందిన నరసింహ నాయుడు , వెంకటేష్ హీరోగా రూపొందిన దేవి పుత్రుడు సినిమాలు సంక్రాంతి పండక్కి విడుదల అయ్యాయి. ఇందులో బాలకృష్ణ హీరోగా రూపొందిన నరసింహ నాయుడు సినిమా సంక్రాంతి విన్నారుగా నిలిచింది. ఇక 2019 వ సంవత్సరం బాలకృష్ణ హీరోగా రూపొందిన కథానాయకుడు సినిమా విడుదల కాక , వెంకటేష్ హీరోగా రూపొందిన ఎఫ్ 2 సినిమా విడుదల అయింది.

ఇందులో ఎఫ్ 2 సినిమా 2019 వ సంవత్సరం సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాలకృష్ణ "డాకు మహారాజ్" సినిమాలో హీరో గా నటిస్తూ ఉండగా ... వెంకటేష్ "సంక్రాంతికి వస్తున్నాం" సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి బరిలో నిలవబోతున్నాయి. మరి ఈ రెండు సినిమాలలో ఏ మూవీ మంచి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: