టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలందరు పాన్ ఇండియా సినిమాలను చెయ్యడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. ఇక ఈ మధ్య ఎక్కువగా అలాంటి సినిమాలే వస్తున్నాయి. డైరెక్టర్లు కూడా స్టార్ హీరోలతో పాన్ ఇండియా సినిమాలనే తెరకేక్కించే పనిలో ఉన్నారు. స్టార్ హీరోల మధ్య పాన్ ఇండియా లెవల్ వార్ జరుగుతుంది.. గత మూడేళ్లుగా ప్రభాస్ ఒక్కడే పాన్ ఇండియన్ హీరోగా సినిమాలు చేయడంతో హిట్, ప్లాపులతో సంబంధం లేకుండా వందల కోట్ల బిజినెస్ జరిగేది. కానీ ఇప్పుడు స్టార్ హీరోలందరు పాన్ ఇండియా లెవల్ లో సినిమాను రిలీజ్ చెయ్యాలని ఆలోచిస్తుండేవారు. ఈ మధ్య ఎక్కువగా ఎన్టీఆర్, రామ్ చరణ్ సినిమాల పైనే ఫోకస్ పెట్టారు.అయితే తమిళ్ సినిమా ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు వెట్రీ మారన్ ప్రస్తుతం ఆయన తమిళ సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపైతే ఉంది. ఇక యావత్ ఇండియాలో ఉన్న హీరోలందరూ అతనితో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు అంటే ఆయన ఎలాంటి సినిమాలు చేస్తూ ముందుకు సాగుతూ ఉంటాడో దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 

ఆయన ధనుష్ తో కలిసి చేసిన సినిమాలన్నీ సూపర్ సక్సెస్ గా నిలిచాయి. ఇంకా దానికి అనుగుణంగానే ఆయన చేసిన ‘అసురన్ ‘ సినిమాకి నేషనల్ అవార్డు రావడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు. ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు అతనితో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్న సందర్భంలో ఆయన మాత్రం పట్టించుకోవడం లేదనే చెప్పాలి. ఎందుకు ఆయన ఇలా చేస్తున్నాడు ఒక మంచి కథతో వాళ్ళిద్దరికి సినిమాలు చేసి పెట్టొచ్చు కదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా వచ్చిన rrr సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆస్కార్ వరకు వెళ్లి నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డు సాధించి సరికొత్త రికార్డ్ సెట్ చేసింది rrr సినిమా. దీంతో rrr సినిమా, రాజమౌళి స్థాయి మరింత పెరిగాయి. సినిమా వచ్చి రెండేళ్లు దాటేసింది. ఇప్పటికీ ఈ సినిమా గురించి అప్పుడప్పుడు ఫ్యాన్స్ అయినా మాట్లాడుకుంటారు.ఇక విరిద్దరి కాంబినేషన్లో మళ్లీసినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: