మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి నయనతార గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె తమిళ సినిమాల ద్వారా కెరియర్ను మొదలు పెట్టి కోలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన స్థాయికి చేరుకుంది. ఆ తర్వాత ఈ బ్యూటీ తెలుగు సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసి టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక సినిమాల్లో నటించి తెలుగులో కూడా స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. ఇలా తెలుగులో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్గా కెరియర్ను కొనసాగిస్తున్న సమయంలోనే ఈమె తన ఇంట్రెస్ట్ ను ఎక్కువ శాతం తమిళ సినిమాలపై పెట్టింది.

అందులో భాగంగా ఈమె తమిళ్లో ఇప్పటికి కూడా అద్భుతమైన క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ను కొనసాగిస్తుంది. తెలుగులో ఈమెకు మంచి గుర్తింపు ఉన్న ఎక్కువగా సినిమాలు చేయడం లేదు. కొంత కాలం క్రితం ఈమె తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో రూపొందిన జవాన్ అనే హిందీ సినిమాలో హీరోయిన్గా నటించింది. షారుక్ ఖాన్ హీరోగా రూపొందిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. ఈ సినిమాలో నయన్ తన నటనతో అందాలతో , ఆకట్టుకోవడంతో హిందీలో కూడా ఈమెకు జవాన్ సినిమా ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. జవాన్ మూవీ తర్వాత ఈమెకి వరుస పెట్టి హిందీ సినిమాలలో అవకాశాలు కూడా వచ్చినట్లు వార్తలు వచ్చాయి. కానీ జవాన్ సినిమా తర్వాత ఈమె ఇప్పటివరకు ఏ హిందీ సినిమాను కూడా ఓకే చేయలేదు.

వరుస హిందీ సినిమాలలో అవకాశాలు వస్తున్న ఇలా ఈమె హిందీ సినిమాను ఓకే చేయకపోవడానికి ప్రధాన కారణం హిందీ పై ఎక్కువ ఫోకస్ పెట్టినట్లయితే కోలీవుడ్లో అవకాశాలు తగ్గే ఛాన్స్ ఉంది అని , ఒక వేళ హిందీలో సక్సెస్ కానట్లయితే కోలీవుడ్ లో కూడా క్రేజ్ తగ్గి అవకాశాలు తగ్గిపోయే ఛాన్స్ ఉంది అనే కారణంతోనే ఈమె హిందీ సినిమాల్లో అవకాశాలు వస్తున్న వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: