కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి అనేక బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకొని తెలుగులో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకోవడం మాత్రమే కాకుండా అదే స్థాయిలో కెరియర్ను చాలా సంవత్సరాల పాటు కొనసాగించింది. ఇకపోతే వరుస సినిమా అవకాశాలు దక్కుతున్న సమయంలోనే ఈమె గౌతమ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా ఈమె సినిమా ఇండస్ట్రీలో కంటిన్యూ అయింది.

పెళ్లి తర్వాత సినిమాలు చేస్తున్న సమయంలోనే ఈమె గర్భవతి కావడంతో కొంత కాలం పాటు కాజల్ సినిమాలకు దూరంగా ఉంది. పండంటి బిడ్డకు జన్మను ఇచ్చిన తర్వాత కాజల్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె పోయిన సంవత్సరం బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన భగవంత్ కేసరి అనే మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో బాలయ్య కు జోడిగా నటించింది. ఇలాంటి కమర్షియల్ విజయం తర్వాత ఈమె సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై ఈ ముద్దుగుమ్మ భారీ అంచనాలు పెట్టుకుంది. ఈ మూవీ కోసం ప్రచారాలను కూడా పెద్ద ఇతర నిర్వహించింది. కాజల్మూవీ పై భారీ అంచనాలు పెట్టుకున్న ఈ మూవీ మాత్రం ఈమెకు తీవ్ర నిరాశను మిగిల్చింది.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. సత్యభామ సినిమా తర్వాత ఈమె నటించిన ఏ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. సత్యభామ మూవీ తర్వాత కచ్చితంగా ఓ భారీ బ్లాక్ బస్టర్ విజయం అందుకునే కథతోనే ప్రేక్షకుల ముందుకు రావాలి అనే ఉద్దేశంతో ఈ బ్యూటీ అనేక కథలను వింటున్నట్లు , అందుకే తన తదుపరి మూవీ కోసం కాజల్ చాలా టైమ్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: