డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో సినిమా చేయాలని స్టార్ హీరోలంతా ఎదురుచూస్తుండేవారు. ఎంతోమంది హీరోలకు బ్లాక్ బస్టర్లు, ఇండస్ట్రీ హిట్లు ఇచ్చారు. బ్యాంకాక్ వెళ్లి తొందరగా కథను రాసుకోవడం, అంతే తొందరగా సినిమా షూటింగ్ ను పూర్తిచేస్తారు. అంత తక్కువ రోజుల్లో సినిమాను ఎలా పూర్తిచేస్తారో తనకు కూడా చెప్పమని దర్శకుడు రాజమౌళి పూరీని అడిగారు. నీ కథలు చాలా బాగుంటాయి.. ఒక్కసారి షూటింగ్ కు వెళ్లేముందుకు నాకు చూపిస్తే అందులో ఏమైనా లోపాలున్నాయేమో సరిచేస్తాను.. ఎందుకంటే నేను నీ ఫ్యాన్ ను అని రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్రప్రసాద్ ఎన్నోసార్లు పూరీని అడిగేవారు.అటువంటి డైరెక్టర్ తాను చేసిన చివరి 10 సినిమాల్లో కేవలం టెంపర్, ఇస్మార్ట్ శంకర్ మాత్రమే హిట్ అయ్యాయి. దీన్నిబట్టి అతని విజయాల శాతం ఎలా పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు. లైగర్ సినిమా తర్వాత పూర్తిగా డౌన్ అయ్యాడు. డబుల్ ఇస్మార్ అడ్రస్ లేదు. చిన్న చిన్న హీరోలు కూడా పూరీతో సినిమా చేయడానికి ముందుకు రావడంలేదు. ఎవరూ కథ వినడానికి కూడా ఆసక్తి చూపించడంలేదు.ఇదిలావుండగా పూరి స్నేహితుడు, మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచే పూరికి కొన్ని సలహాలు ఇస్తున్నారు. పూరి స్టోరీ ల ఎంపిక మారాలి.

ఒకే పేట్రన్ లో సినిమాలు చేస్తున్నారు. స్టోరీ నేపథ్యం మారాలి. మేకింగ్ పరంగా ఆయనకు తిరుగులేదు. మళ్లీ గొప్ప కంబ్యాక్ ఇస్తాడు. పూరి తీయాలనకుంటే మంచి కామెడీ సినిమా తీయలగడు. మంచి కామెడీ ట్రాక్ లు రాయడం ఆయనకు బాగా తెలుసు. ప్రతీ సినిమాలోనూ అద్భుతమైన కామెండీ పండిచగల దర్శకుడు. సీరియస్ యాక్షన్ స్టోరీల్లో కడుపుబ్బా నవ్వించే ట్రాక్స్ రాయడం..వాటిని తీయడంలో ఆయన స్పెషలిస్ట్.ఇక పూర్తి జానర్ లో కామెడీ సినిమా చేస్తే ఇంకా బాగుంటుంది. కానీ ఆయన తీయడు. అదే వచ్చిన సమస్య. ఆయన పాత ట్రాక్ ని దాటి ఒక్క అడుగు ముందుకు వేస్తే అద్బుతాలు చేయగలడు. సినిమా ను ఆయనంత వేగంగా ఎవరూ చేయలేరు. ఇది పూరికి మాత్రమే తెలిసిన టెక్నిక్` అన్నారు.ఇదిలావుండగా ప్రస్తుతం పూరీ జగన్నాథ్ ప్రభాస్ స్పిరిట్ సినిమా కు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయబోతున్నారని తెలుగు ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి.అసిస్టెంట్ డైరెక్టర్ అంటే మాటల రచయితగా స్పిరిట్ సినిమాకు చేస్తారని చెబుతున్నారు.సందీప్ కు, పూరీకి మంచి స్నేహం ఉండటంవల్ల ఇది సాధ్యమవుతోంది. అయితే పూరీ జగన్నాథ్ రేంజ్ వేరు.. సందీప్ రెడ్డి రేంజ్ వేరు.. ఇదే ప్రభాస్ తో పూరీ గతంలో ఏక్ నిరంజన్, బుజ్జిగాడు సినిమాలు తీశారు. ఇప్పుడు అదే ప్రభాస్ సినిమాకు మాటల రచయితగా పనిచేయాల్సి వస్తోంది. సందీప్ కోసం రాస్తే పర్వాలేదని, కానీ ఆదాయం అనేది మనిషికి ఉండాలి కాబట్టి డైలాగులు రాస్తున్నారంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: