తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో అల్లరి నరేష్ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి అందులో చాలా మూవీతో మంచి విజయాలను అందుకున్నాడు. ఇకపోతే తాజాగా ఈయన బచ్చల మల్లి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ నుండి మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అయిన మొదటి రోజు మొదటి షోకే మిక్స్డ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ కి ప్రస్తుతం పెద్ద స్థాయిలో కలెక్షన్లు దంచడం లేదు. ఇకపోతే కొంత కాలం క్రితం అల్లరి నరేష్ ఓ ఇంటర్వ్యూలో భాగంగా తన మొదటి సినిమా అయినటువంటి అల్లరి మూవీ.కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూ లో అల్లరి నరేష్ మాట్లాడుతూ ... నేను నటించీమ మొదటి సినిమా అల్లరి. ఆ సినిమా విడుదల తేదీ దగ్గర పడింది. కానీ నేను ఆ సినిమాకి సంబంధించిన డబ్బింగ్ పనులను పూర్తి చేయలేదు. దానితో ఆ మూవీ దర్శకుడు అయినటువంటి రవి బాబు ఒక రోజు వచ్చి త్వరగా డబ్బింగ్ చెప్పు అన్నాడు. వెంటనే ఆ రాత్రి నేను డబ్బింగ్ చెప్పడం మొదలు పెట్టి ఉదయం వరకు కంప్లీట్ చేశాను.

సినిమా నిర్మాత అయినటువంటి సురేష్ బాబు ఉదయం జాగింగ్ చేస్తూ అటు వైపు వచ్చాడు. ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు. డబ్బింగ్ చెప్పాను అన్నాడు. దానితో ఆయన షాక్ అయ్యి లోపలికి వెళ్లి నేను చెప్పిన డబ్బింగ్ మొత్తం చూసి సూపర్ గా ఉంది అని చెప్పి వెళ్ళిపోయాడు. అలా నేను చాలా స్పీడ్ గా అల్లరి మూవీ కి డబ్బింగ్ చెప్పాను అని అల్లరి నరేష్ తాజాగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: