టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.సినీ ఇండస్ట్రీలో ఎంతో గౌరవం అందుకున్న ఈయన.. గత కొన్ని రోజులుగా కుటుంబ కలహాలతో ఉన్న పరువును పోగొట్టుకున్నారని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా మంచు మనోజ్, మంచు విష్ణు మధ్య ఆస్తి గొడవలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈసారి ఏకంగా మోహన్ బాబు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఇదిలావుండగా జర్నలిస్టుపై దాడి చేసిన కేసులో మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన గడువు పూర్తయింది. ఇప్పటివరకు పోలీసుల విచారణకు ఈయన అందుబాటులోకి రాలేదు.దీంతో మోహన్ బాబుకు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. కేసు నమోదైన ఫహడీ షరీఫ్ పోలీసులు. ఈయన ఎక్కడున్నారో తెలుసుకునే పనిలో ఉన్నారు. దీంతో ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశముందని తెలుస్తోంది.టైమ్ బాకాలేకపోతే.. అరటి పండు తిన్న పన్ను విరుగుతుందనే సామెత మోహన్ బాబు విషయంలో నిజమే అనిపిస్తోంది.

హీరోను సెలబ్రిటీని కదా..అని ఎలా పడితే అలా ప్రవర్తిస్తే చట్టం చూస్తూ ఉరుకుంటుదనుకున్నాడు.కానీ ఇపుడు చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఈ క్రమంలో నిన్న అల్లు అర్జున్ విచారణ పూర్తి అవటం తో పుష్ప కు జస్ట్ బ్రేక్ దొరికింది. ఈ గ్యాప్లో మోహన్ బాబుకు షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు.ఇదిలావుండగా దాడి జరిగిన తర్వాత రోజే అనారోగ్య సమస్యలతో మోహన్ బాబు ఆస్పత్రిలో చేరారు. కొన్నిరోజుల పాటు తనని అరెస్ట్ చేయకుండా కోర్టు అనుమతి తెచ్చుకున్నారు. ఇప్పుడు ముందస్తు బెయిల్ కోసం అప్లై చేయగా దాన్ని తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. ఒకవేళ కావాలంటే దిగువ కోర్టుకు వెళ్లాలని సూచించింది.అనారోగ్య కారణాల దృష్ట్యా డిసెంబర్ 24వ తేదీ వరకు మోహన్ బాబుని అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్ట్ ఆదేశించింది. నిన్నటితో ఆ గడువు ముగిసింది. అయినా సరే ఇప్పటికీ మోహన్ బాబు.. పోలీసులకు అందుబాటులోకి రాకపోవడంతో ఆయన అరెస్ట్ తప్పదని తెలుస్తోంది. తొలుత నోటీసులు ఇచ్చి, ఆ తర్వాత అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: