పుష్ప 2 రిలీజ్ సమయంలో సంధ్య థియేటర్ వద్ద తొక్కిసులాట జరిగిన ఘటనలో రేవతి మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ గత 20 రోజులుగా ఆసుపత్రి బెడ్ పైనే ఉన్నారు. ఈమధ్య మెల్లమెల్లగా కోలుకుంటున్నారు అంటూ వైద్యులు కూడా తెలియజేస్తున్నారు. ఈ బాలుడు ఆరోగ్య విషయంలో కూడా రోజుకు ఒక ఎపిసోడ్ చాలా ఉత్కంఠంగా కనిపిస్తోంది.. ఈ విషయంపై  తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా సినీ సెలబ్రిటీలను ఉద్దేశించి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పటినుంచి శ్రీ తేజ్ ను పరామర్శించడానికి ఎవరో ఒకరు వెళుతూనే ఉన్నారు. అయితే ఇప్పటివరకు శ్రీ తేజ్ కుటుంబానికి ఆర్థికంగా ఎంతటి సహాయం వచ్చింది ఆ వివరాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్న వాటి గురించి చూద్దాం.



అల్లు అర్జున్ పుష్ప 2 ప్రీమియర్ షో కి వెళ్లడంతో అక్కడ తొక్కిసలాట జరగడంతో రేవతి కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయం పైన అటు థియేటర్ యాజమాన్యం పైన అల్లు అర్జున్ పైన కేసు వేయడంతో ప్రస్తుతం ఈ కేసు కూడా నడుస్తూ ఉన్నది.ఇటీవలే అల్లు అర్జున్ బెయిల్ మీద కూడా బయటికి వచ్చారు. గత మూడు వారాల నుంచి తెలంగాణ ప్రతినిధులు శ్రీతేజ్ ఆరోగ్యం పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ఈ సంఘటన జరిగినప్పటి నుంచి కొంతమంది సినీ సెలబ్రెటీలు శ్రీతేజ్ కుటుంబానికి ధైర్యం చెప్పి భరోసా ఇచ్చారు. తాజాగా పుష్ప మేకర్స్ రూ .50 లక్షల రూపాయలు నష్టపరిహారాన్ని ఇచ్చారు.. అలాగే డైరెక్టర్ సుకుమార్ అల్లు అర్జున్  , మైత్రి మూవీస్ మేకర్స్ వారు కూడా రెండు కోట్ల రూపాయలతో ఒక ట్రస్ట్ ని ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం. వీటితోపాటు దిల్ రాజు కూడా రేవతి భర్తకి సినీ ఇండస్ట్రీలో ఏదైనా పర్మినెంట్ ఉద్యోగం ఇప్పిస్తామంటూ తెలిపారు. అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరామిరెడ్డి కూడా 25 లక్షల రూపాయలు అందించారు. అంతేకాకుండా శ్రీ తేజ అని కూడా అన్ని విధాలుగా సహాయంగానే ఉంటామని హామీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: