పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా ? ఈ అందాల ముద్దుగుమ్మ చిత్ర పరిశ్రమను ఏలిన‌ స్టార్ హీరోయిన్ లో ఒకరు .. అబ్బాయిల కలల రాకుమారి .. హిందీ తెలుగు తమిళ భాషలో అగ్ర హీరోలు అందరితో కలిసి నటించింది .. ఇంత పెద్ద సినీ కెరియర్ ఉన్న ఈ నటి వ్యక్తిగత జీవితం మాత్రం ఓ పెద్ద విషాదం .. ఇంతకీ ఆమె మరెవరో కాదు బాలీవుడ్  స్టార్ హీరోయిన్ మనీషా కొయిరాలా .. తన అందం నటనతో ఎంతోమంది అభిమానులను తన వైపు తిప్పుకుంది ఈ సీనియర్ బ్యూటీ .. అప్పట్లో చాలా మంది స్టార్ హీరోలు సైతం మనీషా కొయిరాలా తో కలిసి నటించడానికి ఎంతో ఇంట్రెస్ట్ చూపించేవారు .


1970లో నేపాల్ లో పుట్టిన మనీషా కొయిరాలా .. తన సినీ ప్రయాణాన్ని 1991లో మొదలుపెట్టింది .. సౌదాగర్ సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది .. ఆ తర్వాత అసలు వెనక తిరిగి చూసుకోలేదు.. వరుస అవకాశాలతో దూసుకుపోయింది .. 30 సంవత్సరాల తన కెరీర్ లో దాదాపు 70 సినిమాలు నటించింది ఈ ముద్దుగుమ్మ .. తెలుగులోనూ ముంబాయి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది .. ఆ తర్వాత భారతీయుడు , ఒకేఒక్కడు వంటి సినిమాల తో బ్లాక్ బస్టర్ విజయాలు అందుకుంది .. ఇంతలా తన సినీ జీవితం సక్సెస్ సాధించిన .. మనీషా కొయిరాలా వ్యక్తిగత జీవితం మాత్రం ఆమెకు చేదు జ్ఞాపకంగా మిగిలింది .


చిత్ర పరిశ్రమలో ఎఫైర్లు బ్రేకప్ లు పెళ్లిళ్లు విడాకులు అనేవి చాలా కామన్ .. కానీ మనిషా కొయిరాలా తన కెరియర్ లో చాలామంది తో డేటింగ్ చేసిందని టాక్ .. బాలీవుడ్ హీరోలు వివేక్ ముశ్రన్ , నానా పటేకర్ , బిజినెస్ మాన్ సెసిల్ ఆంథోనీ .. ఇలా ఒకరి తర్వాత ఒకరు ఏకంగా 12 మందితో ఈ ముద్దుగుమ్మ సన్నిహితంగా మేలిగిందని అప్పట్లో పలు రూమర్లు బయటకు వచ్చాయి .. అయితే ఈ సీనియర్ భామ మాత్రం వీరిలో ఎవరిని పెళ్లి చేసుకోలేదు .. ఇదే క్రమంలో 2018 లో మనిషా కొయిరాలా బిజినెస్ మాన్ సామ్రాట్ దహల్‌ను పెళ్లి చేసుకుంది .. కానీ వీరిద్దరూ వ్యక్తిగత కారణాలతో రెండేళ్లకే విడిపోయారు .. 53 ఏళ్ల వయసులో ఒంటరిగా జీవిస్తుంది మనీషా కోయిరాలా.. ఇటీవల క్యాన్సర్ ను జయించి పునర్జన్మను పొందింది ఈ సీనియర్ బ్యూటీ .

మరింత సమాచారం తెలుసుకోండి: