సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక విషయం పైన హీరోయిన్ కస్తూరి శంకర్ పేరు వినిపిస్తూ ఉంటుంది. కస్తూరి శంకర్ తమిళ సినీ ఇండస్ట్రీలో ఎక్కువ సినిమాలలో నటించినప్పటికీ తెలుగులో అన్నమయ్య, ఇంటింటా గృహలక్ష్మి అని సీరియల్ లో కూడా నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఇటువంటి కస్తూరి శంకర్ తెలుగు ప్రజల పైన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఈమె పైన కేసు వేయడమే కాకుండా జైలుకెళ్ళి కూడా వచ్చింది. అలా జైలుకు వెళ్లి వచ్చిన నటి కస్తూరి తన అనుభవాలను అభిమానులతో పంచుకుంది వాటి గురించి చూద్దాం.



మొదటిసారి తాను ఆరోపణల మీద ఇలా జైలుకు వెళ్లాలననీ.. అయితే జైలుకు వెళుతున్న సమయంలో నియమ నిబంధనలు తెలియక చాలా ఇబ్బందులు మొదట్లో పడ్డానని తెలిపింది. జైలుకు వెళ్లేటప్పుడు తమ వెంట బట్టలు, టూత్ పేస్ట్, బ్రష్, సబ్బులు వంటివి తీసుకువెళ్లాలని కానీ ఈ విషయం తనకు తెలియదని తనని అరెస్టు చేసిన మహిళా పోలీసులు కూడా ఇవన్నీ తనకు కొని ఇచ్చారని వెల్లడించింది. జైలు లోపలికి వెళ్లే సమయంలో కేవలం నాలుగు జతల దుస్తులను మాత్రమే అనుమతిస్తారని.. తినుబండారాలను అసలు లోపలికి అలోవ్ చేయరని తెలిపింది నటి కస్తూరి. ఇలా ఇవే కాకుండా చాలా రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయని వెల్లడించింది. కొన్నిసార్లు పర్సనల్గా కూడా చెక్ చేస్తారని తెలిపింది.


ఇదంతా ఇలా ఉండగా కస్తూరి తన మొదటి ఇన్నింగ్స్ లో హీరో నాగార్జున నటించిన అన్నమయ్య చిత్రంలో మరదలి పాత్రలో నటించింది. ఈ సినిమా అప్పట్లోనే మంచి విజయాన్ని అందుకుంది. తమిళంలో ఎక్కువగా ఆఫర్లు రావడంతో తెలుగు సినీ పరిశ్రమను దూరం పెట్టి తమిళంలోనే పలు చిత్రాలలో నటించింది. కానీ చివరికి తన సెకండ్ ఇన్నింగ్స్ ని మాత్రం తెలుగు బుల్లితెరపై సీరియల్స్ లతో మొదలుపెట్టింది. దీంతో ఒకవైపు సీరియల్స్ లో మరొకవైపు చిత్రాలలో కూడా నటిస్తూ ఉన్నది కస్తూరి శంకర్.

మరింత సమాచారం తెలుసుకోండి: