వరస ఫ్లాప్ లతో సతమతమైపోతున్న నితిన్ తాను నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాబిన్ హుడ్’ పై చాల ఆశలు పెట్టుకున్నాడు. వాస్తవానికి ఈ మూవీ డిసెంబర్ 20 లేదంటే డిసెంబర్ 25న విడుదల కావలసి ఉంది. ‘పుష్ప 2’ మ్యానియాకు భయపడి ఈమూవీ విడుదల వాయిదా వేసిన విషయం తెలిసిందే.



ప్రస్తుతం అల్లు అర్జున్ కొన్ని సమస్యలలో చిక్కుకున్న నేపధ్యంలో ‘పుష్ప 2’ ప్రమోషన్ పూర్తిగా ఆగిపోయింది. దీనితో ఈమూవీ కలక్షన్స్ పూర్తిగా తగ్గిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికితోడు గతవారం విడుదలైన ‘బచ్చల మల్లి’ ఘోరమైన ఫ్లాప్ గా మారడంతో పాటు గతవారం విడుదలైన డబ్బింగ్ సినిమాలు అన్నీ కూడ ఫెయిల్ అవ్వడంతో ధియేటర్లు అన్నీ బోసిపోతున్నాయి.



ఇలాంటి పరిస్థితులలో ముందుగా అనుకున్న ప్రకారం ‘రాబిన్ హుడ్’ విడుదల అయి ఉంటే క్రిస్మస్ సీజన్ హిట్ గా మారి ఉండేది అన్న కామెంట్స్ మరికొందరు చేస్తున్నారు. ఈ సినిమాకు మంచి ప్రీ రిలీజ్ పాజిటివ్ టాక్ కొనసాగుతున్న పరిస్థితులలో నితిన్ పరిస్థితులను అంచనా వేయడంలో పొరపాటు చేశాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. క్రిస్మస్ సీజన్ మిస్ కావడంతో ఇప్పుడు ఈసినిమాకు సరైన రిలీజ్ డేట్ దొరకడం లేదు అన్నమాటలు వినిపిస్తున్నాయి.



సంక్రాంతికి భారీ సినిమాలు విడుదల అవుతున్న నేపధ్యంలో ఆసినిమాల మధ్య నితిన్ కు స్థానం దొరకదు. ఆతరువాత వచ్చే రిపబ్లిక్ డే కి రావాలని ప్రయత్నిస్తున్నప్పటికీ అక్కడ కూడ భారీ పోటీ ఉంది. దీనితో ఫిబ్రవరి ‘వ్యాలెంటైమ్స్ డే’ కి రావాలని ఆలోచన ఉన్నప్పటికీ అక్కడ నాగచైతన్యతో గట్టిపోటీ ఉంది. ప్రభాస్ కాలికి గాయం కావడంతో అతడి లేటెస్ట్ మూవీ ‘రాజా సాబ్’ ఏప్రియల్ 10న విడుదలకాకపోవచ్చు అంటున్నారు. అదే జరిగితే ఆ డేట్ వరకు నితిన్ ఎదురు చూడటం తప్ప మరో మార్గం లేదు అంటూ మరికొందరి అభిప్రాయం. దీనితో ‘రాబిన్ హుడ్’ రిలీజ్ విషయంలో నితిన్ పొరపాటు చేశాడా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు..





మరింత సమాచారం తెలుసుకోండి: