అల్లు అర్జున్ అరెస్టు అయిన తర్వాత బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత బన్నీ ఫ్యాన్స్ చాలా రిజర్వుడ్గానే ఉంటూ వస్తున్నారు. ఎక్కడ కూడా హద్దులు మీరడం లేదు.  ఘాటు కామెంట్స్ చేయడం లేదు . ఎక్కడ కూడా ఒకరిని ఇబ్బందులకు గురి చేసే మాటలు అస్సలు మాట్లాడడం లేదు . తమ ఫ్యాన్ ని మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ అల్లు అర్జున్ కూడా అభిమానులకి ప్రత్యేకంగా సందేశం కూడా ఇచ్చారు.  ఏ అభిమాని కూడా తొందరపడకండి అని జాగ్రత్తగా మాట్లాడాలి జాగ్రత్తగా ఉండాలి అంటూ రిక్వెస్ట్ చేశారు .


అల్లు అర్జున్ మాటలను బన్నీ ఫాన్స్ చాలా స్క్రిప్ట్ గా ఫాలో అవుతున్నారు.  అందుకే ఎక్కడ కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసభ్యకర పోస్టులు ఒకరిని వేలెత్తి చూపించే పోస్ట్ చేయడం లేదు.  కానీ కొందరు బన్నీ అభిమానులు మాత్రం రేవంత్ రెడ్డిని బాగా టార్గెట్ చేశారు . అల్లు అర్జున్ ని కావాలని అరెస్టు చేయిస్తున్నాడు అని త్వరలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఢమాల్ అంటూ కూలిపోతుంది అంటూ ఓ రేంజ్ లో ట్రెండ్ చేస్తున్నారు . అంతేకాదు పిచుక మీద బ్రహ్మాస్త్రమా..? అనే రేంజ్ లో అల్లు అర్జున్ కాబట్టి ఇంత వైల్డ్ యాంగిల్ లో చూస్తున్నారు .



అదే వేరే ఏ హీరో అయినా సరే ఈ యాంగిల్ లోనే  చూసేవారా..? ఏ టైర్2 హీరోనో అయితే ఇంత స్ట్రిక్ట్ గా పట్టుకునేవారా ..? అల్లు అర్జున్ కాబట్టే కదా మీరు ఇంతలా టార్చర్ చేస్తున్నారు..?  ఆయనను పర్సనల్గా మీరు ఇబ్బందులకు గురి చేసేది చూస్తుంటే మీలోని శాడిజం బయటపడుతుంది..? అంటూ దారుణాతి దారుణంగా మాట్లాడేస్తున్నారు . కొందరైతే రేవంత్ రెడ్డి చేసిన పనికి ఫిదా అయిపోతున్నారు. నీలాంటి సీఎం అందరికీ కావాలి అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు . కానీ మరి కొంతమంది వర్షెన్ మాత్రం వేరేలా ఉంది . అల్లు అర్జున్ పై పగబట్టాడు అంటూ పొలిటికల్ పరంగా అల్లు అర్జున్ ని లాగుతున్నారు అంటూ మండిపడుతున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: